TS POLITICS TELANGANA BJP STATE PRESIDENT BANDI SANJAY MADE INTERESTING COMMENTS ABOUT THE THIRD PHASE OF THE PRAJA SANGRAMA YATRA PRV
Third Phase Praja sagrama yatra: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
బీజేపీ చీఫ్ బండి సంజయ్
వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ లో బీజేపీ బూత్ కమిటీ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురించి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతుండటంతో కాషాయం నాయకులంతా ప్రజల్లోనే ఉండాలని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Telangana BJP state president Bandi Sanjay) కూడా ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టారు. మొదటి దశ ప్రజా సంగ్రామయాత్ర (First Phase Praja sangrama Yatra) ను పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్ ప్రారంభించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన జోగులాంబ ఆలయం (Jogulamba Temple) నుంచి రెండో దశ యాత్ర ప్రారంభం అయింది. అవినీతి, నియంత, కుటుంబ పాలన నిర్మూలనే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్టు బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 14న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రం ముగిసింది. అయితే తాజాగా ఆయన ఓ కార్యక్రమానికి హాజరైన బండి మూడో విడత పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ లో బీజేపీ బూత్ కమిటీ సమావేశానికి బుధవారం బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వెంట ఆ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర నాయకుడు కటకం మృత్యుంజయం ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ కమిటీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని బండి అన్నారు. తెలంగాణ లో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ సైకో లాగా మారాడని విమర్శించారు. ఆయన ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బండి మండిపడ్డారు.
అధికారంలోకి వస్తే..
తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయని బండి చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యాట్ టాక్స్ తగ్గించినా.. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
తన పాదయాత్రతో తెలంగాణ సమాజానికి ఒక భరోసా వచ్చిందని బండి సంజయ్ అన్నారు. త్వరలోనే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర (Third Phase Praja sangrama Yatra) చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. అట్టడుగు ప్రజలకు అండగా బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కేసీఆర్ ఎన్ని అడ్డకుంలు సృష్టించినా ప్రజా సంగ్రామ యాత్ర సభ విజయవంతం అయ్యిందని బండి సంజయ్ అన్నారు.
శ్రీలంకలో ఏమైంది?
అన్ని సర్వే సంస్థలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పని అయిపోయిందని చెబుతున్నాయని, అన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని బండి తెలిపారు. శ్రీలంక లో కుటుంబ పాలన ఏమైందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో అతి ముఖ్యమైన శాఖలు కేసీఆర్ కుటుంబానికే ఉన్నాయని బండి ఆరోపించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు సాలరీలు, పెన్షన్ లు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని అన్నారు. కానీ శ్రీలంక పరిస్థితి రాకూడదని అన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.