హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: బండి సంజయ్ సంచలన ప్రకటన.. కామారెడ్డిలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

Bandi Sanjay: బండి సంజయ్ సంచలన ప్రకటన.. కామారెడ్డిలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Bandi Sanjay: మొన్న చనిపోయిన రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నిన్న కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళనతో దద్దరిల్లిన కామారెడ్డిలో మళ్లీ టెన్షన్ వాతావరణం మొదలైంది. మొన్న చనిపోయిన రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay).. తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రంతా కలెక్టరేట్ బయటే కూర్చుంటానని అన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఎందుకు రారో చూస్తానని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తానని తెలిపారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ కలెక్టరేట్ ముందు కూర్చోవాలని నిర్ణయం తీసుకోవడంతో కామారెడ్డిలో(Kamareddy) ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టరేట్ దగ్గరకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు.

అంతకుముందు మాస్టర్ ప్లాన్‌ను(Master Plan) వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. వున్న రెండెకరాలు కూడా ఇండస్ట్రియల్ జోన్‌కు పోతుందున్న ఆవేదనతోనే రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులతో మొండిగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇండస్ట్రియల్ జోన్‌కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. రెండు పంటలు పండించే రైతుల పొలాలను గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయడం దీనినే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు వున్నాయని.. వాటిని ఇండస్ట్రియల్ జోన్‌ కింద తీసుకోవచ్చు కదా అని సంజయ్ ప్రశ్నించారు.

 

ఎవరూ ప్రశ్నించరని, ఎదురు తిరగరనే పేద రైతుల భూములు లాక్కొని వారి పొట్టకొడుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. అధికారులు, బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై వారికి అనుకూలంగా మాస్టర్ ప్లాన్ మార్చుకుంటోందని సంజయ్ ఆరోపించారు. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మాస్టర్‌ప్లాన్‌ను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. రైతులు ఆందోళన చేయకుంటే అసలు ఈ విషయం బయటపడేది కాదని సంజయ్ వ్యాఖ్యానించారు.

PM Narendra Modi: తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ..? ఆ సీటుపైనే బీజేపీ ఫోకస్..!

kadapa: సంక్రాతి పండుగకి ఆర్టీసీ బంపర్ ఆఫర్స్.. ఏంటో తెలుసా..?

కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్‌పై కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్‌పై వుందని.. చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలని అన్నారు. లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలన్నారు. తెలంగాణలో రైతులు సమస్యల్ని పట్టించుకోని కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలోని పట్టణాలు, నగరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

First published:

Tags: Bandi sanjay, Kamareddy, Telangana

ఉత్తమ కథలు