తెలంగాణ బీజేపీ చీఫ్ ను హైకమాండ్ మార్చబోతుందనే ప్రచారంపై బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ..బీజేపీలో టికెట్ల కేటాయింపులో ఎవరు హామీ ఇచ్చిన కుదరదని అన్నారు. ఇక హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని బండి సంజయ్ (Bandi Sanjay) చెప్పుకొచ్చారు. అయితే గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మారుస్తున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో స్పందించిన బండి సంజయ్ (Bandi Sanjay) ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే బీజీపీ హైకమాండ్ నిజంగానే బండి సంజయ్ (Bandi Sanjay) ను బీజేపీ చీఫ్ గా తొలగించాలని చూస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీకి ఆ ఇద్దరు..అప్పటి నుంచే ప్రచారం..
తెలంగాణ బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ (Etela Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి నవంబర్ 15న బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. దీనితో వారు హుటాహుటీన ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో వీరు భేటీ అయ్యారు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా వారు ఢిల్లీకి వెళ్లిన దగ్గర నుండి బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ ప్రచారంపై బండి సంజయ్ స్పందించినప్పటికీ బీజేపీ హైకమాండ్ మదిలో ఏముందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
అసంతృప్తితో ఆ ఇద్దరు..
అయితే ఈటెల రాజేందర్ (Etela Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) పార్టీలో కొంత అసంతృప్తితో ఉన్నారు. టీఆర్ఎస్ , కేసీఆర్ తో నెలకొన్న విభేదాలతో ఈటెల రాజేందర్ పార్టీని వీడారు. ఆ తరువాత బీజేపీ కండువా కప్పుకున్నారు. అయినా హుజురాబాద్ ఉపఎన్నికలో తన పట్టుతో బీజేపీ నుండి కూడా ఈటెల విజయం సాధించారు. అయితే ఇతర పార్టీల నుండి బీజేపీలోకి చేరిన వారు పార్టీ బలోపేతం కోసం బాగానే కష్టపడుతున్నారు. కానీ వారు ఎక్కడ బలపడుతారేమో అని అలా తమ స్థానాలకే ఎసరు వస్తుందని బీజేపీలో పాతుకుపోయిన కొంతమంది నాయకులు సహకరించడం లేదని తెలుస్తుంది. ఈటెల చేరికల ఇంఛార్జిగా ఉన్నారు. కానీ ఆయనకు తెలియకుండానే పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఇలా అన్ని పనులు ఒక్కరే చేస్తున్నారు. దీనిపై ఈటెల అసంతృత్తితో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) పార్టీలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ వారికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తుంది.
తిరిగి కారెక్కితే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Hyderabad, Telangana, Telangana News, Telangana Politics