మళ్లీ ఏపీ, తెలంగాణను కలిపిపే స్వాగతిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ఆడిస్తున్న డ్రామాగా అభివర్ణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడి.. అక్కడి నాయకుడితో ఈ రకమైన వ్యాఖ్యలు చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేయొచ్చని.. తద్వారా కవిత లిక్కర్ స్కామ్ అంశంపై ప్రజల దృష్టి మరల్చవచ్చని ఆయన ప్లాన్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసే ఉన్నారని.. కమీషన్లు కూడా పంచుకుంటారని ఆరోపించారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ విభజనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే మొదట స్వాగతించేందుకు వైసీపీనే అన్నారు. రాష్ట్ర విభజనను తిప్పి పంపాలని.. లేదా సర్దుబాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుదిరితే ఉమ్మడి ఏపీ మళ్లీ కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానం అన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాధనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్రం విభజన చేసిన తీరుపైనా కోర్టులో కేసులు వేశారన్నారు. రాష్ట్ర విజభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచి పోటీ చేస్తున్నది వైసీపీ ఒక్కటే అంటూ.. ఉండవల్లి అరుణ్ కుమార్ (Vundavalli Arunu Kumar) ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మళ్లీ కలవడం కల, అది ఎప్పటికీ నిజం కాదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత మళ్లీ కుట్రపూరిత వ్యాఖ్యలు చేయడంపై ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర అనేది ముగిసిన అధ్యాయం అని, ఇప్పుడు కలపాలనే కొత్త ఆలోచన చేయాలనే సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.
TRS MLAs Poaching Case: సిట్ రివిజన్ పిటీషన్ పై ముగిసిన విచారణ..రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు
ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల..సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న పొన్నం ప్రభాకర్
రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి..కానీ మళ్ళీ తెలంగాణ లో రజాధికరం కోసం ప్రత్నిస్తే ఊరుకునేది లేదు. అమరవీరుల ఆకాంక్ష మేరకే వారి ప్రాణ తాగ్యల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ రాజకీయ లబ్ధికోసం ఎవరికి ఇష్టం వచ్చిన వాక్యాలు చేస్తూ కాలయాపన చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Telangana