హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: టార్గెట్ మునుగోడు.. బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా..

Bandi Sanjay: టార్గెట్ మునుగోడు.. బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా..

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Bandi Sanjay: బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షడు అయిన తరువాత తెలంగాణలో బీజేపీ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో మునుగోడులోనూ పార్టీ విజయం సాధించేందుకు బండి సంజయ్ మరింతగా శ్రమిస్తారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. రాజకీయ పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో బీజేపీని(BJP) ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే క్రమంలో విడతల వారీగా బండి సంజయ్ పాదయాత్ర చేపడుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay).. మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో తన ఐదో విడత పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర నాలుగు విడతలను పూర్తి చేసుకున్న బండి సంజయ్.. ఈ నెల 15 నుంచి ఐదో విడత పాదయాత్రను చేపట్టాలని బండి సంజయ్ భావించారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఆయన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. బీజేపీ తరపున మునుగోడు ఉప ఎన్నిక బరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.

  కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించాలనే యోచనలోనే కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవడం ద్వారా తెలంగాణలో భవిష్యత్తంతా బీజేపీదే అని చాటిచెప్పాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ ముఖ్యనేతలంతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విజయం కోసం మునుగోడులో మకాం వేయనున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయనున్నారు.

  బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షడు అయిన తరువాత తెలంగాణలో బీజేపీ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో మునుగోడులోనూ పార్టీ విజయం సాధించేందుకు బండి సంజయ్ మరింతగా శ్రమిస్తారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ చీఫ్‌గా టీఆర్ఎస్, కేసీఆర్‌ను విమర్శించడంలో గతంలో ఏ బీజేపీ నాయకుడు చూపించనంత దూకుడును ప్రదర్శిస్తున్నారు బండి సంజయ్. ఈ కారణంగానే పార్టీ జాతీయ నేతల దృష్టిలో మంచి మార్కులు వేయించుకున్నారు.

  KCR: దసరా రోజు మీటింగ్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేసీఆర్.. మునుగోడు షెడ్యూల్ నేపథ్యంలో..

  Munugodu Bypoll: మునుగోడు ఎవరిది? టీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీకి డూ ఆర్ డై వార్

  మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. తన తదుపరి పాదయాత్ర మరింత విజయవంతం అవుతుందనే భావనలో ఉన్న బండి సంజయ్.. ఇప్పటికే అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ చీఫ్‌గా రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బండి సంజయ్.. మునుగోడు విక్టరీతో ముచ్చటగా మూడో విజయాన్ని కూడా అందుకుంటారేమో తెలియాలంటే వచ్చే నెల 8వ తేదీ వరకు ఆగాల్సిందే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bandi sanjay, Munugodu By Election, Telangana

  ఉత్తమ కథలు