తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, ప్రధాని మోదీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ధ్వజమెత్తారు. తమ పార్టీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు అని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతామని ప్రశ్నించారు. 57 ఎమ్మెల్యేలు కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఉన్నారని.. అందుకే కేసీఆర్(KCR) భయపడుతున్నారని ఆరోపించారు. సీబీఐ(CBI) విచారణకు కవిత హాజరుకాకపోతే ఊరుకోరని.. ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లి విచారణ చేస్తారని బండి సంజయ్ అన్నారు. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని ఆరోపించారు. ఈ కేసును వెంటనే రీ ఓపెన్ చేసి విచారణ జరిపి దోషులను నడిబజారులో నిలబెట్టాలని దర్యాప్తు సంస్థలను కోరారు.
కవిత విచారణకు వెళ్లకుండా సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గతంలో ప్రతిపక్ష పార్టీల నుండి 37 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లో చేర్చుకొని కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూల్చేయలేదా ? అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు త్వరలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలుస్తారని బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
చలాన్ల పేరుతో నిర్మల్ పోలీసులు రోజుకు లక్ష రూపాయలు వసూలు చేయాలని మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. కవితను అరెస్టు చేస్తే తెలంగాణ బిడ్డను అరెస్టు చేసినట్టు చెప్పి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ దందాలో కేసీఆర్ కూతురు జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Big News: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..ఆ పాపం ఊరికే పోదంటూ తీవ్ర విమర్శలు
Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్..నా అంత అదృష్టవంతుడు ఎవడు లేడంటూ..
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ నోటీసులు అందుకున్న కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీని సీబీఐ ఈ మెయిల్ చేసింది. అయితే ఈ FIR కాపీలో తన పేరు లేదని, రేపు సీబీఐ విచారణకు అందుబాటులో ఉండలేనని మరోసారి కవిత లేఖ రాసింది. అయితే ఈనెల 11, 12, 14,15 తేదీల్లో హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటా అని ఆమె తెలిపింది. తాను చట్టాన్ని గౌరవిస్తానని...దర్యాప్నతుకు పూర్తిగా సహకరిస్తానని కవిత పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Telangana