రాష్ట్రంలో ఓ నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. మన్నెగూడలో జరుగుతున్న బీజేపీ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. ధరణి పేరుతో ఆ నలుగురు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. వారి వ్యవహారంపై ఆధారాలు సేకరించామన్న బండి సంజయ్.. త్వరలోనే వారి బండారం బయటపెడతామని హెచ్చరించారు. కేసీఆర్ (KCR) కుటుంబానికి ఆ కలెక్టర్లు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రగతి భవన్‌లో(Pragati Bhavan) అన్ని పనులు ఆ నలుగురే చక్కబెడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారి వల్ల రాష్ట్రానికి, కష్టపడి పనిచేస్తున్న ఐఏఎస్‌లకు చెడ్డపేరు వస్తోందని బండి సంజయ్ విమర్శించారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. 119 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని.. అప్పుడు ఆ పార్టీకి డిపాజిట్లు వస్తాయో లేదో చూద్దామంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల్లో బడ్జెట్‌పై చర్చ లేదని.. మాటలు తప్ప చేతల్లేవని అన్నారు. కేటాయింపులు ఘనం..ఖర్చులు స్వల్పమని ఎద్దేవా చేశారు.
రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ. 1.30 లక్షల కోట్లే చూపడమా? మిగిలిన ఆదాయం ఎక్కడి నుండి వస్తుందో ఎందుకు చెప్పలేదు ? అని కామెంట్ చేశారు. లిక్కర్, భూములు అమ్మకోవడం, పన్నులు, ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. కేంద్రాన్ని తిట్టడానికి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుందని వ్యాఖ్యానించారు.
Telangana New Secretariat: సెక్రెటేరియేట్ లో జరిగింది ప్రమాదమా లేక నరబలా? హైకోర్టులో KA పాల్ పిల్
Big News: ఎమ్మెల్యేల ఎర కేసు..ప్రభుత్వ పిటీషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..విచారణ వాయిదా!
దేశంలో బడ్జెట్‌ను పూర్తి వివరాలతో ప్రవేశపెట్టారని... లిక్కర్ ఆదాయం రూ.40 వేల కోట్లుంటే... కేసీఆర్ అమలు చేస్తున్న ప్రధానమైన సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు దాటడం లేదని ఆరోపించారు. అప్పులు చేస్తున్న లక్షల కోట్లు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని మండిపడ్డారు. కేంద్రం సంక్షేమ పథకాలను చెప్పడం..టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నామని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Telangana