హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana BJP: బీసీలపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఏప్రిల్ నుంచి కొత్త కార్యక్రమం..

Telangana BJP: బీసీలపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఏప్రిల్ నుంచి కొత్త కార్యక్రమం..

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

BJP: రాష్ట్రంలోని 55లక్షల బీసీ కుటుంబాలకు బీజేపీని చేరువ చేయడంపై పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాష్ట్రంలో అధికారం లోకి రావాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగిన విధంగా కార్యాచరణను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే నిరుద్యోగులు, మహి ళలు, రైతులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఉద్యమిస్తున్న కాషాయ పార్టీ తాజాగా బీసీ, ఓబీసీలపై (BC OBC) గురి పెట్టింది. రాష్ట్రంలోని 55లక్షల బీసీ కుటుంబాలకు బీజేపీని (BJP)చేరువ చేయడంపై పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటి వరకు ప్రజా గోస- బీజేపీ భరోసా పేరుతో ప్రజా సమస్యలపై పాదయాత్రలు, మహిళా గోస- బీజేపీ భరోసా పేరుతో మహిళల సమస్యలపై, నిరుద్యోగ గోస - బీజేపీ భరోసా పేరుతో నిరు ద్యోగుల సమస్యలపై ఉద్యమించిన పార్టీ ఇప్పుడు బీసీ గోస- బీజేపీ భరోసా పేరుతో మరో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

ఈ కార్యక్రమం కింద పల్లె పల్లెకు ఓబీసీ... ఇంటింటికీ బీజేపీ నినాదంతో బీసీల సమస్యల పరిష్కారంపై బీజేపీ ఉద్యమించనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రత్యేకంగా కరపత్రాన్ని రూపొందించారు. అందులో కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను పేర్కొంటూ బీసీలను రాష్ట్రంలోని అధి కార బీఆర్ఎస్ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో వివరిస్తూ పలు అంశాలను చేర్చారు.

రాజకీయంగా, ఆర్థికపరంగా, విద్యాపరంగా, సామాజిక న్యాయం విషయంలో, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలు బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యారని కరపత్రంలో పలు అంశాలు చేర్చారు. పల్లె పల్లెకు ఓబీసీ, ఇంటింటికీ బీజేపీ కార్యక్ర మాన్ని ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభిస్తారని నేతలు చెప్పారు. రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో ఆయన స్వయంగా ఈ కార్య క్రమంలో పాల్గొని బీసీల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం

తెలంగాణ చరిత్రలోనే రికార్డ్..ఈరోజు అత్యధిక విద్యుత్ వినియోగం..ఎంతంటే?

దేశానికి ఓ బీసీ నాయకుడిని ప్రధానిగా బీజేపీ అందించిందని, అయితే రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా తగిన అవకాశాలు లభించడం లేదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అనేక విధాలుగా ప్రజల్లోకి వెళుతున్న బీజేపీ నేతలు.. జనాభాలో అత్యధికంగా ఉంటే బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Bjp, Telangana

ఉత్తమ కథలు