TS POLITICS TELANGANA BJP COUNTER MAY GIVE COUNTER TO RAHUL GANDHI WARANGAL DECLARATION BY AMIT SHAH MEETING AK
Telangana Amit Shah: మారిన బీజేపీ ప్లాన్.. రాహుల్ గాంధీకి ఆ రకంగా కౌంటర్ ఇవ్వనున్న అమిత్ షా ?..
రాహుల్ గాంధీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)
Telangana: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతుల కోసం ఏం చేస్తామనే దానిపై సొంతంగా ఓ డిక్లరేషన్‌ను సిద్ధం చేయాలనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ రేసులోకి వచ్చినట్టు భావిస్తోంది. వరంగల్ సభకు రాహల్ గాంధీ (Rahul Gandhi) రావడం.. రైతు డిక్లరేషన్ పేరుతో తెలంగాణ రైతాంగానికి కీలక హామీలు ఇవ్వడం ఎంతోకొంత ప్రభావం చూపే అంశంగా మారింది. పైకి కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ వల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పార్టీలు చెబుతున్నా.. ఆ పార్టీ ఇచ్చి డిక్లరేషన్ హామీకి ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలనే అంశంపై ఆయా పార్టీలు గట్టిగానే కసరత్తు చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. తాము అమలు చేస్తున్న పథకాలను కాంగ్రెస్ పార్టీ తమ డిక్లరేషన్‌లో కాపీ కొట్టిందని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. అయితే రైతుల కోసం సీఎం కేసీఆర్(KCR) మరింత మెరుగైన పథకాలను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో అధికార టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని పదే పదే చెబుతున్న బీజేపీ సైతం.. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌కు కౌంటర్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 13 బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణకు రానున్నారు. ఈ సభను తెలంగాణ బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ కోసం ఐదు లక్షలకు పైగా జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ సన్నాహాలు కూడా చేసుకుంటోంది. ఈ సభ ద్వారా బీజేపీ ఎక్కువగా అధికార టీఆర్ఎస్నే టార్గెట్ చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు.
తాజాగా తెలంగాణకు రాహుల్ గాంధీ రావడం.. ఆ పార్టీ వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో.. కాంగ్రెస్‌ను కూడా బీజేపీ సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతుల కోసం ఏం చేస్తామనే దానిపై సొంతంగా ఓ డిక్లరేషన్‌ను సిద్ధం చేయాలనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆ లైన్లోనే వెళతారా ?.. తాము అనుకున్నట్టు చేస్తారా ?.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్
Bandi Sanjay: బండి సంజయ్‌కు టీఆర్ఎస్ ఆ విధంగా షాక్ ఇచ్చిందా ?.. ముందస్తు ప్లాన్ ?
అయితే దీనిపై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే తెలంగాణ రైతులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇవ్వాలంటే.. తాము కూడా అదే తరహాలో డిక్లరేషన్ రూపొందించాల్సి ఉంటుందని ఆ పార్టీ బలంగా నమ్ముతున్నట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.