Home /News /telangana /

TS POLITICS TELANGANA BJP CHIEF BANDISANJAY MADE CONTROVERSIAL REMARKS DURING THE KARIMNAGAR HINDU EKTA YATRA SNR KNR

TS|BANDI SANJAY: కరీంనగర్ ఏక్తాయాత్రలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..రాష్ట్ర బీజేపీ చీఫ్ ఏం మాట్లాడారో తెలుసా

(ఏక్తాయాత్రలో బండి కామెంట్స్)

(ఏక్తాయాత్రలో బండి కామెంట్స్)

Bandi Sanjay:కరీంనగర్‌లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏక్తాయాత్రలో పాల్గొన్న బండి సంజయ్ మజ్లీస్‌ పార్టీ ఎంపీకి సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీ రద్దు చేస్తామని ఉర్దును అధికారిక భాషగా తొలగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana)రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandisanjay)చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. హనుమాన్‌ జయంతి సందర్భంగా కరీంనగర్‌(Karimnagar)హిందూ ఏక్తాయాత్ర(Hindu Ekta Yatra)లో ఆయన హిందువులకు అండగా ఉంటాం..సంపూర్ణ హిందూ సమాజాన్ని నిర్మిస్తామనే వ్యాఖ్యలు చేస్తూనే ముస్లిం(Muslims)లకు వ్యతిరేకంగా మతపరమైన వ్యాఖ్యలు చేయడం కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. గతంలో తెలంగాణలో వేలాది ఆలయాలను ధ్వంసం చేశారన్న బండి సంజయ్..రాష్ట్రంలోని మసీదులన్ని తొవ్వితే శివలింగాలు బయటపడతాయన్నారు. కాదని నిరూపించమని ఎంఐఎం ఎంపీ, మజ్లీస్‌ నేత అసదుద్దీన్‌ ఓవైసీ(Asaduddin Owaisi)కి సవాల్‌ విసిరారు. మసీదులు తొవ్వితే శవాలొస్తే మీవి..శివలింగాలు వస్తే మావంటూ ఏక్తాయాత్రకు భారీగా తరలవిచ్చిన హిందూవులను చూసిన ఉత్తేజంలో ఈకామెంట్స్ చేశారు.

కాంట్రవర్సీ కామెంట్స్..
అంతే కాదు తెలంగాణకు పట్టిన శని పీడని కాషాయంతో గడిగేసి రామరాజ్యాన్ని స్థాపించి తీరుతామన్నారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి రాగానే మదర్సాలు, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామనిప్రకటించారు. ప్రస్తుతం అధికారిక భాషగా ఉన్న ఉర్దును శాశ్వతంగా నిషేదిస్తామన్నారు. దేశంలో, రాష్ట్రంలో విధ్వంసాలు, దారుణాలు, దాడుల వెనుక ఉన్నది ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఇక్కడే మూలాలుంటున్నాయని ..ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మదర్సాలున్నాయన్ని తీవ్ర ఆరోణలు చేశారు బండి సంజయ్. వాళ్లకు సాంకేతికంగా, ఆర్ధికంగా సహాయం చేయడం సిగ్గుచేటన్నారు.

బండి టార్గెట్ మజ్లీస్..
ఇకపై లవ్ జిహాదీ పేరుతో అక్కా చెళ్లెళ్లను ట్రాప్ చేస్తే ఊరుకోమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ . లవ్ జిహాదీ అన్నోడికి లాఠీ రుచి చూపిస్తామన్నారు.పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మత మార్పిళ్లు చేస్తే మక్కెలిరగదీస్తామన్నారు. ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా మాత్రమే చూశారని ..త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతుందన్నారు. సెక్యులర్ వాదం పేరుతో 15శాతం ఓట్ల కోసం పొత్తులు పెట్టుకున్న రాష్ట్ర పాలకుల కళ్లు తెరిపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టీఆర్‌ఎస్‌ నేతలపై పరోక్ష విమర్శలు చేశారు బండి సంజయ్.

నేను పక్కా లోకల్..
తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ జిల్లా ప్రజలను ఎన్నటికి మర్చిపోలేనన్న బండి సంజయ్ వారి చలువతోనే రాష్ట్రంలో నాకు పేరొస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా గెలిపించాలని ప్రజలకు సంకేతాన్ని ఇచ్చారు. తాను ఢిల్లీకి రాజైనా కరీంనగర్‌కి బిడ్డనే అన్నారు. ఇక్కడి జిల్లా ప్రజలకు ఓ పెద్ద కొడుకుగా ఉంటానన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో ఏ హిందువుకు కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు తన చివరి రక్తపు బొట్టును సైతం ధార పోసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు బండి సంజయ్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి సంజయ్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, మైనార్టీలపై విరుచుకుపడటంపై రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: AIMIM, Bandi sanjay, Karimnagar, Telangana bjp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు