హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: బండి సంజయ్‌ కొడుకు భగీరథ్‌కు నోటీసులిచ్చిన పోలీసులు .. దాడి వీడియోపై ఉచ్చు బిగుస్తోందా..!

Bandi Sanjay: బండి సంజయ్‌ కొడుకు భగీరథ్‌కు నోటీసులిచ్చిన పోలీసులు .. దాడి వీడియోపై ఉచ్చు బిగుస్తోందా..!

BANDI SANJAY

BANDI SANJAY

Bandi Sanjay:రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు పోలీసులు నోటీసు లిచ్చారు. విద్యార్థిపై దాడి చేశాడన్న కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)కుమారుడు బండి భగీరథ్‌(Bhagirath)కు పోలీసులు నోటీసు(Notice) లిచ్చారు. విద్యార్థిపై దాడి చేశాడన్న కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌(Hyderabad)లోని మహేంద్ర యూనివర్సిటీలో ఓ విద్యార్థిని బూతులు తిడుతూ.. విచక్షణారహితంగా కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యూనివర్సిటీలో భగీరథ్ ర్యాగింగ్ Ragingచేశాడన్న ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. వీటిపై స్పందించిన దుండిగల్(Dundigal) పోలీసులు ఇప్పటికే బండి భగీరథపై కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు.

Success Story: లక్షల జీతం వదులుకొని నాటు కోళ్ల వ్యాపారంలో అడుగుపెట్టిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..రిజల్ట్ ..?

బండి సంజయ్‌ కుమారుడికి నోటీసులు..

హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న బండి భగీరథ్.. అయితే కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని ఇష్టమున్నట్టు బూతులు తిడుతూ దాడి చేసిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భగీరథ్ ఓ విద్యార్థిని ర్యాగింగ్ చేస్తూ.. రౌడీయిజం చేస్తున్నాడంటూ వార్తలు పెద్దఎత్తున ప్రచారం జరిగాయి. ఇదే విషయం పెద్దఎత్తున్న చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో బండి భగీరథ్ చేత దెబ్బలు తిన్న విద్యార్థి.. ఈ విషయంపై స్పందించాడు. ఆ వీడియోలో ఉన్నట్టు తనను కొట్టింది నిజమే కానీ.. దానికి కారణం ర్యాగింగ్ కాదని.. చాలా పెద్ద స్టోరీ ఉందని చెప్పుకొచ్చాడు. తప్పు మాత్రం తనదేనని.. ఆ ఘటన తర్వాతా ఇద్దరం కాంప్రమైజ్ అయ్యామని క్లారిటీ ఇచ్చాడు.అనవసరంగా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారంటూ వివరించాడు.

ర్యాగింగ్ కేసులో పోలీసుల యాక్షన్..

బండి సంజయ్ కుమారుడు భగిరథ్ దౌర్జన్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావటంతో.. అది కాస్తా పోలీసులకు చేరింది. దీనికి తోడు యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు చేశారు. దీంతో బండి భగీరథ్ మీద దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. CR. NO : 50/2023 u/s 341, 323, 504, 506 r/w 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఇప్పుడు అందుకు సంబంధించి 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు.

వీడియో వైరల్ కావడంతో కేసు..

అయితే తన కుమారుడు భగీరథ్ వ్యవహారంపై ఎంపీ బండి సంజయ్ అప్పుడే స్పందించారు. పిల్లలన్నాక కొట్టుకుంటారు తిట్టుకుంటారు.. అలాంటి వాటిని కేసీఆర్ ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదంటూ నెపాన్ని సీఎంపై నెట్టే ప్రయత్నం చేశారు. ఏదైనా ఉంటే తనతో ఢీ కొనాలి తప్ప పిలల్ని రాజకీయ గొడవల్లోకి లాగడం సిగ్గుచేటు అన్నారు. గతంలో నీ మనవడిపై సోషల్ మీడియాలో ట్రోల్ ఆ యినప్పుడు నేను పిల్లలపై టోల్ చేయవద్దని సోషల్ మీడియా వారియర్‌కు బదులిచ్చాను అంటూ తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు.

First published:

Tags: Bandi sanjay, Crime news, Telangana News

ఉత్తమ కథలు