Home /News /telangana /

TS POLITICS TELANGANA BJP CHIEF BANDI SANJAY COMMENTS ON CM KCR OVER NITI AAYOG NS

CM KCR-Bandi Sanjay: కేసీఆర్ వాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్

కేసీఆర్, బండి సంజయ్(ఫైల్ ఫోటో)

కేసీఆర్, బండి సంజయ్(ఫైల్ ఫోటో)

కేసీఆర్ ప్రెస్ మీట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కొనే ముఖం లేక సీఎం కేసీఆర్ ఆగస్టు 7 నాటి నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొడుతూ... దానికి వేరే కారణాలు చెబుతుండటం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  నీతి అయోగ్ (Niti Aayog) సమావేశాన్ని బైకాట్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన కేసీఆర్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే.. కేసీఆర్ ప్రెస్ మీట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra Modi) ఎదుర్కొనే ముఖం లేక సీఎం కేసీఆర్ ఆగస్టు 7 నాటి నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొడుతూ... దానికి వేరే కారణాలు చెబుతుండటం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో ఎనాడూ అధికారిక సమావేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం.. రాజకీయ పార్టీలతో సమావేశాల కోసం ఢిల్లీ పోవడం తప్ప ప్రజల కోసం చర్చించేందుకు ఏనాడూ వెళ్లలేదన్నారు.

  ‘‘నీతి అయోగ్ అద్భుతం అని పొగిడింది మీరు కాదా కేసీఆర్... మీరు కోరినంత డబ్బులిస్తే నీతి అయోగ్ మంచిది... లేకుంటే మంచిది కాదా? ఇదే మీ రాజనీతి? మీకు నచ్చినట్లుగా, మీ పక్షాన లేదని నీతి అయోగ్ లాంటి గొప్ప సంస్థను నిందించడం ప్రజా స్వామ్య వ్యవస్థలను అవమానించడమే. నరేంద్రమోదీ గారి ప్రభుత్వం లబ్దిదారులకే నేరుగా నగదును బదిలీ (DBT) చేస్తుండటంతో ప్రజలకు ఫలితాలు అందుతున్నయి. దీనిపై మీ పెత్తనం పోతుందని, కమీషన్లు అందడం లేదనే అక్కసుతోనే మీరు నీతి అయోగ్ పై ఆరోపణలు చేస్తున్న మాట వాస్తవం కాదా? అందుకే కరోనా సమయంలో మీరు హెలికాప్టర్ మనీ (నేరుగా రాష్ట్రాలకు నిధులు) పంపాలని కోరిన మాట వాస్తవం కాదా?’’ అని కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్.
  CM KCR: జాతిపితను అవమానిస్తారా? దేశ చరిత్రను మలినం చేస్తారా? బీజేపీపై సీఎం కేసీఆర్​ ఫైర్​

  కేంద్రం నేరుగా స్థానిక సంస్థలకు నిధులిస్తుందనే కేసీఆర్ ఏడుపు అని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లూ కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ కేంద్ర పథకాలకు పేర్లు మార్చుకుంటూ గడిపిన టీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్రాలకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని బదనాం చేస్తోందన్నారు. ఇన్నాళ్లు నరేంద్ర మోదీ గారిని తిట్టుడు, బిజెపిని తిట్టుడు, బండి సంజయ్ ను తిట్టుడుతోనే కేసీఆర్ కు సరిపోయిందన్నారు. ఇగ నీతి అయోగ్ ను తిట్టడం మొదలైందన్నారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం అనుచితమైన ఉచితాలిస్తూ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం వల్ల శ్రీలంక వంటి పరిస్థితి వస్తుందని, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కేంద్రానికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు.

  సుప్రీం సూచనను కేంద్రానికి అంటగట్టడం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. గతేడాది కేంద్రం రూ.5 వేల కోట్లు కూడా ఇవ్వలేదని చెబుతున్న కేసీఆర్ 5 రోజులు ఢిల్లీలో ఉండి కేంద్రాన్ని బెదిరించి రూ.10 వేల కోట్లు అప్పు సాధించానని చెబుతున్నారన్నారు. మరి కేంద్రం నిజంగా డబ్బులివ్వకపోతే ఏడాది నుండి ఏం చేసినట్లు? అని ప్రశించారు. గత ఏడాది కేంద్రం 5 వేల కోట్ల కంటే ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే అసెంబ్లీ ముందు కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? అని ధ్వజమెత్తారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేసిన నియంత కేసీఆర్... కేంద్రం మీద ధర్నాలు చేసి ఏదో సాధిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే, స్పీకర్ తో బెల్ కొట్టిస్తున్న కేసీఆర్... నీతి అయోగ్ మీటింగ్ ల మాత్రం బెల్ కొడుతున్నరని అపహాస్యం చేయడం హాస్యాస్పదమన్నారు.

  దేశంలో కంపెనీల NPAల గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ లో ఎందుకు వేల పరిశ్రమలు మూతపడ్డాయో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బతుకమ్మ చీరలు తెలంగాణలో తయారు చేయించడం చేతగాక సూరత్ నుంచి దిగుమతి చేసుకునే కేసీఆర్ ఇతర దేశాల దిగుమతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముందు ప్రగతి భవన్ ఫర్నీచర్ ను చైనా నుండి ఎందుకు తెప్పించుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, ఇంటర్ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఆత్మహత్యలకు కారకుడైన కేసీఆర్ కేంద్రాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ప్లానింగ్ కమిషన్ చరిత్ర, కోఆపరేటివ్ ఫెడరలిజం, ప్రజాస్వామ్య స్పూర్తి గురించి పాఠాలు చెబుతున్న కేసీఆర్, సీఎం నౌకరీ మాత్రం చేయడం లేదని విమర్శలు గుప్పించారు. నీతి అయోగ్ సమావేశాలను కేసీఆర్ బహిష్కరించడం కాదు.. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bandi sanjay, CM KCR, Niti Aayog, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు