Home /News /telangana /

TS POLITICS TELANAGNA CM KCR SAID THAT POLITICAL SENSATIONS WERE GOING TO BE REGISTERED IN THE COUNTRY AFTER MEETING CHIEF MINISTER ARVIND KEJRIWAL IN DELHI PRV

CM KCR Delhi tour: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ను కలిసిన కేసీఆర్​​.. దేశ రాజకీయాల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయని ప్రకటన

కేజ్రీవాల్​తో సీఎం కేసీఆర్​ (Photo: ANI/Twitter)

కేజ్రీవాల్​తో సీఎం కేసీఆర్​ (Photo: ANI/Twitter)

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయని వెల్లడించారు.

    దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటన (CM KCR Delhi tour) కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు.  సీఎం కేసీఆర్‌ బృందానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియా సాదర స్వాగతం పలికారు. అనంతరం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Chief Minister Arvind Kejriwal )తో కలిసి కేసీఆర్‌ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్‌ (CM KCR) తిలకించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇద్దరు వ్యాపారవేత్తలు కలిస్తే బిజినెస్​ గురించే మాట్లాడుకుంటారని అలాగే ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే రాజకీయాలే మాట్లాడుతారని కేసీఆర్​ అన్నారు. అంతేకాకుండా దేశ రాజకీయాల్లో (National Politics) సంచలనాలు నమోదు కాబోతున్నాయని వెల్లడించారు.

    ఈ సందర్భంగా విద్యారంగంలో ఢిల్లీ సర్కార్ కృషి అభినందనీయమని కేసీఆర్ ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యార్థులను జాబ్ ప్రొవైడర్లుగా మారుస్తున్న విధానం చాలా బాగుందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యావిధానం ఏకపక్షంగా ఉందని, రాష్ట్రాలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. త్వరలో తెలంగాణ అధికారుల బృందం ఢిల్లీలో పర్యటించి ఇక్కడ అమలు అవుతున్న విద్యావిధానాన్ని పరిశీలిస్తారని కేసీఆర్​ అన్నారు.

    అయితే అంతకుముందు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో (akhilesh yadav) కేసీఆర్ భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు ప్రధానంగా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే దేశానికి ప్రత్యామ్నాయ కూటమి వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కలిసి పనిచేసే అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.

    దూకుడు పెంచిన కేసీఆర్​..

    దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్న కేసీఆర్​.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్‌, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఉన్నారు.

    సీఎం కేసీఆర్.. మే 22న చండీఘర్‌లో పర్యటించనున్నారని.. వివాదస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరణించిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లలో కూడా  పర్యటించనున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Aravind Kejriwal, CM KCR, Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు