హోమ్ /వార్తలు /తెలంగాణ /

Teenmar Mallanna: బీజేపీకి షాకిచ్చిన తీన్మార్ మల్లన్న.. చేరిన 6నెలలకే గుడ్‌బై.. త్వరలో కొత్త రాజకీయ పార్టీ

Teenmar Mallanna: బీజేపీకి షాకిచ్చిన తీన్మార్ మల్లన్న.. చేరిన 6నెలలకే గుడ్‌బై.. త్వరలో కొత్త రాజకీయ పార్టీ

తీన్మార్ మల్లన్న

తీన్మార్ మల్లన్న

ఆరు నెలలు తిరక్కముందే బీజేపీకి షాకిస్తూ తీన్మార్ మల్లన్న కమలం శిబిరం నుంచి బయటికొచ్చేశారు. ఆదివారం తన అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో మల్లన్న త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించారు.

తెలంగాణలో అధికార సాధనే ధ్యేయంగా ముందుకెళుతోన్న బీజేపీ.. సైద్ధాంతిక భావజాలాన్ని పట్టించుకోకుండా కేసీఆర్ వ్యతిరేకులు లేదా బాధితులకు అండగా నిలుస్తుండటం తెలిసిందే. టీఆర్ఎస్ సర్కారుతో విభేదాల కారణంగా కేసులు ఎదుర్కొన్న పలువురు నేతలు, కేసీఆర్ తీరు నచ్చనివారు వరుసగా బీజేపీలో చేరిన క్రమంలో ప్రముఖ జర్నలిస్టు, యాక్టివిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న సైతం గత డిసెంబర్ లో కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఆరు నెలలు తిరక్కముందే టీబీజేపీకి షాకిస్తూ తీన్మార్ మల్లన్న కమలం శిబిరం నుంచి బయటికొచ్చేశారు. ఆదివారం తన అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో మల్లన్న స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు, త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని పెడతాననీ ఆయన ప్రకటించారు.

త్వరలో రాజకీయ పార్టీ పెడతానని చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న అన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దొంగల సంఖ్య 7200 అని, రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్న ఆ 7200 మంది వెలమ దొరల భరతం పడతానని ఆయన హెచ్చరించారు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములలో తీన్మార్‌ మల్లన్న టీం-7200 ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉచిత విద్య, వైద్యం, ప్రజలకు సత్వర న్యాయంపై తీర్మానాలు చేశారు. అనంతరం మల్లన్న మాట్లాడారు.

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. సొంతగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు.. నేడే ప్రకటన?


‘రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దొంగల ముఠా సభ్యుల సంఖ్య 7200. తెలంగాణ ఆస్తులను కొల్లగొడుతున్న వారి సంఖ్య 7200. రాష్ట్ర ప్రజల రక్తం తాగుతున్న వారి సంఖ్య 7200. అందుకే మల్లన్న టీం-7200 పేరుతో నేను ఉద్యమం చేస్తున్నా. నేను ఏర్పాటు చేసిన ఈ టీం బీజేపీ కన్నా లక్ష రెట్లు నయం. ఇక బీజేపీ కార్యాలయంలో నేను ఎప్పటికీ అడుగుపెట్టను. నేను బీజేపీలో చేరడం అనేది ఇక ముగిసిన చరిత్ర’ అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

CM KCR పాలనకు కేంద్రం కితాబు.. టీబీజేపీలో గడ్కరీ కలకలం.. ప్రసంగ పాఠంలో గడబిడ వల్లేనట!


కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశామని, మరో పది రోజుల్లో ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. తనపై, తన కుటుంబ సభ్యులపై ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వస్తానని తీన్మార్ మల్లన్న తెలిపారు. 176 మంది చిన్నారులకు తమ టీం గుండె చికిత్స చేయించిందని, రాష్ట్రంలో విద్య, వైద్యం, న్యాయం అందని ప్రజల మద్దతును కూడగట్టుకుంటామని, ఏడాదిన్నర తరువాత హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో పది లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Teenmar mallanna, Telangana

ఉత్తమ కథలు