Home /News /telangana /

TS POLITICS TEENMAR MALLANNA ARRESTED IN HANUMAKONDA DISTRICT SNR

Teenmar Mallanna:తీన్మార్ మల్లన్న అరెస్ట్ ..అక్కడికి వెళ్లగానే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Teenmar Mallanna:క్యూ న్యూస్‌ నిర్వాహకుడు, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా ఆరేపల్లిలో రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతిచ్చేందుకు వెళ్లిన సమయంలో మల్లన్నను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు మల్లన్నను అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తూ ..అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ రాజకీయనేతగా ఎదిగిన క్యూ న్యూస్‌ నిర్వాహకుడు, జర్నలిస్ట్(Journalist)తీన్మార్‌ మల్లన్న(Teenmar Mallanna)ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా పర్యటనకు వెళ్లిన మల్లన్నను అక్కడ పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ జిల్లా ఆరెపల్లిలో భూసేకరణ జీవో 80ఏ(GO80A)ను రద్దు చేయాలని రైతులు చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు తీన్మార్ మల్లన్న హనుమకొండ(Hanumakonda)జిల్లాలోని ఆరేపల్లి(Arepalli)కి వెళ్లారు. అక్కడ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతిచ్చేందుకు వెళ్లిన తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అడ్డుకున్నారు. ఆసందర్భంలోనే ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

తీన్మార్ మల్లన్న అరెస్ట్ ..
రైతుల పక్షాన పోరాడేందుకు వెళ్లిన మల్లన్నను అడ్డుకోవడం సరైన పద్దతి కాదని అతని అనుచరులు, ఆందోళనకారులు పోలీసులను ప్రశ్నించారు. అదే సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్ చేశారు. అదే సమయంలో తీన్మార్ మల్లన్న రైతులకు తన మద్దతు తెలిపారు. బాధిత రైతులకు అండగా ఉంటామని చెప్పారు. 80ఏ జీవోను రద్దు చేసేంత వరకు రైతులంతా ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. దాంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. భూసేకరణ జీవో 80ఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులంతా పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

రైతుల పోరాటనికి మద్దతు..
గాంధేయ పద్దతిలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారంటూ నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత మందిని అరెస్ట్ చేసినా జీవో రద్దు విషయంలో వెనక్కి తగ్గేది లేదని..ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ.. ప్రజాప్రతినిధులపై తనదైన శైలీలో ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు తీన్మార్ మల్లన్న. ఒక సాధారణ జర్నలిస్ట్ స్థాయి నుంచి రాజకీయ నేతగా, సోషల్ మీడియాలో ప్రజల పక్షాల ప్రశ్నలు సంధిస్తూ జనంలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

80ఏ జీవో రద్దుపై పోరాడాలన్న మల్లన్న..
రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న కార్యక్రమాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో అనేక కేసుల్లో చిక్కుకున్నారు మల్లన్న. అంతే కాదు వివాదాస్పద వార్తలు, కామెంట్స్‌ చేసి జైలుకు కూడా వెళ్లారు. తన ఆస్తులన్నంటినీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. 7200 మూవ్మెంట్ (7200 Movement) ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా పోరాటం చేస్తామని శపథం చేశారు మల్లన్న.

అరెస్టులు, కేసులు..
అంతే కాదు ఇటీవలే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సైతం మల్లన్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాధరమైన ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని పరువునష్టం దావా నోటీసులు పంపారు. దీనిపై కూడా మల్లన్న తనదైన శైలీలో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. పువ్వాడ అజయ్‌ పరువు విలువ 10కోట్లేనా అంటూ సెటైర్లు కూడా వేశారు. పాదయాత్ర ప్రారంభించడానికి మరికొద్ది రోజుల ముందే తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్ చేయడం పట్ల ఆయన సానుభూతిపరులు, అనుచరులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు మద్దతిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Teenmar mallanna, Telangana Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు