Home /News /telangana /

TS POLITICS TDP DOWNFALL IN TELANGANA BECAUSE OF REVANTH REDDY JAGGAREDDY SAYS CONGRESS WILL SURELY FALL IF PCC CHIEF IS NOT REMOVED SNR

Telangana : రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉంటే..టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్‌కి పడుతుంది: జగ్గారెడ్డి

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana: తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టనుందా? కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. గతంలో రేవంత్‌రెడ్డి అతివిశ్వాసం కారణంగానే టీడీపీ పత్తా లేకుండాపోయిందని కామెంట్ చేశారు. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతల్లో చర్చ మొదలైంది.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌ మునిగిపోయే పడవేనా ..? రాష్ట్రంలో టీడీపీ(TDP)కి పట్టిన గతే కాంగ్రెస్‌(Congress)కు పట్టనుందా అంటే సంగారెడ్డి ఎమ్మెల్యే(Sangareddy MLA ) జగ్గారెడ్డి (Jaggareddy)తాజాగా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అదే అర్దాన్ని ఇచ్చే విధంగానే ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ని టార్గెట్‌ చేస్తూ వచ్చిన జగ్గారెడ్డి..ఆదివారం ఆ మాటలను పార్టీ వైపునకు మళ్లించారు. అంతే కాదు హైకమాండ్‌ రేవంత్‌రెడ్డి దుందుడు స్వభావానికి అడ్డుకట్ట వేయకపోతే పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో అంతా తానే చేయాలని..తన గొప్ప కోసం చేసిన ఓటుకు నోటు వ్యవహారం కారణంగానే టీడీపీ తెలంగాణలో కనుమరుగైపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 9ఏళ్లు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి హైదరాబాద్‌లో ఉండి లేనట్లుగా మారిపోవడానికి రేవంత్‌రెడ్డి దూకుడు స్వభావమేనని కీలక విమర్శలు చేశారు జగ్గారెడ్డి.

టీడీపీకి పట్టిన గతే పడుతుందా ..
ఇంతకాలం పార్టీ అధిష్టానం, రాహుల్‌గాంధీ మాటలను గౌరవించి విమర్శలు చేయలేదన్న జగ్గారెడ్డి..రేవంత్‌రెడ్డి చేస్తుంది ముమ్మాటికి తప్పేనని..అలాంటి వ్యక్తి టీపీసీసీ చీఫ్‌ పదవికి అనర్హుడన్నారు. షార్ట్‌ టెంపర్ కలిగిన వ్యక్తి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడని విమర్శించారు జగ్గారెడ్డి. ఇలాంటి వ్యక్తులు చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మాణిక్కం ఠాగూర్, కేసీ వేణుగోపాల్ ఖచ్చితంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని లేఖ రాస్తానన్నారు జగ్గారెడ్డి.



జగ్గారెడ్డి మాటల వెనుక మర్మమేంటి..
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హాకు స్వాగతం పలికేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్‌ని ఉద్దేశించి బండకేసి కొడతా అని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనే జగ్గారెడ్డి ఈస్థాయిలో తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం సంచలన ప్రకటన చేస్తానన్నారు. అయితే ఆయన నిర్ణయం పార్టీ హైకమాండ్‌కి టీపీసీసీ చీఫ్‌పై ఫిర్యాదు చేయడమా లేక తాను పార్టీని వీడటమా అది కాకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమా ఇవేమి కాకుండా బీజేపీ తీర్ధం పుచ్చుకోవడమా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి.

ఇది చదవండి: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.. రేపు కాంగ్రెస్​కు రాజీనామా?


 


ఏం డిసైడ్ చేస్తారో ..
జగ్గారెడ్డి నిర్ణయంపై అనేక వార్తలు బయటకు వస్తున్నప్పటికి ఆయన మాత్రం తనకు ఎవరి మద్దతు అవసరం లేదని..తాను ఒంటరిగానే ఉంటానన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలగకూడదని, కాంగ్రెస్‌ నేతలు అవమానపడకూడదనే ఆలోచనతోనే ఈ విధంగా మాట్లాడాల్సి వస్తోందన్నారు జగ్గారెడ్డి. సోమవారం ప్రకటించే సంచలన నిర్ణయం ఏమిటో చూడాలి.

ఇది చదవండి: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. హోంమంత్రి అమిత్ షా ధీమా


Published by:Siva Nanduri
First published:

Tags: Jaggareddy, Revanth Reddy, Telangana Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు