టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఇక దేశవ్యాప్తంగా సత్తా చాటేందుకు సిద్ధమవుదామని సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. అయితే టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మార్చే కార్యక్రమానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. బీఆర్ఎస్ (BRS) కార్యక్రమాలకు, కేసీఆర్‌ను కలవడానికి ప్రకాశ్ రాజ్ రావడం కొత్తేమీ కాదు. కేసీఆర్‌ను గతంలో అనేకసార్లు కలిసిన ప్రకాశ్ రాజ్.. ఆయనతో కలిసి ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించారు. ఒక దశలో ప్రకాశ్ రాజ్‌కు(Prakash Raj) కేసీఆర్ తన పార్టీ తరపున రాజ్యసభ సీటు కూడా ఇస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఆ తరువాత గులాబీ పార్టీ కార్యకలాపాలకు, కేసీఆర్‌తో(KCR) సమావేశాలకు ప్రకాశ్ రాజ్ పెద్దగా హాజరైంది కూడా లేదు. దీంతో ప్రకాశ్ రాజ్ కేసీఆర్‌కు దూరంగా జరిగారనే ప్రచారం కూడా సాగింది.
కానీ తాజాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన వేడుకలకు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. కీలక సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ప్రకాశ్ రాజ్‌కు గులాబీ పార్టీలో ఏ రకమైన పదవి లేదా బాధ్యత ఇవ్వొచ్చనే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ తరపున ఇతర రాష్ట్రాలకు ప్రతినిధులను నియమించే యోచనలో ఉన్న పార్టీ అధినేత కేసీఆర్ .. ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటక లేదా తమిళనాడు లేదా మహారాష్ట్రకు ప్రతినిధిగా నియమించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరీ ముఖ్యంగా మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోయే కర్ణాటకలో బీఆర్ఎస్ తరపున ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కుమారస్వామిని కర్ణాటక సీఎం చేయాలని అన్నారు.
KCR-BRS: ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరాలి.. కర్ణాటకలో జేడీఎస్‌కు మద్దతు ఇస్తామన్న కేసీఆర్
BRS: బీఆర్ఎస్ కొత్త జెండా, కండువాను చూశారా? అంతా సేమ్.. అదొక్కటే చేంజ్..
ఈ క్రమంలో కర్ణాటకకు ప్రకాశ్ రాజ్‌కు బీఆర్ఎస్ ప్రతినిధిగా చేయడం వల్ల రెండు పార్టీ మధ్య సమన్వయం ఉంటుందని కేసీఆర్ ఆలోచించి ఉండొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్ తరపున ఎలాంటి పదవి దక్కించుకోలేకపోయిన ప్రకాశ్ రాజ్‌కు బీఆర్ఎస్ తరపున అయినా ఏదైనా పదవిని కేసీఆర్ అప్పగిస్తారేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Prakash Raj