హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: అక్కడ ఏ పార్టీ కార్యక్రమాలు ఉన్నా బీఎస్పీ నేతలు అరెస్ట్ కావాల్సిందేనా?

Nagarkurnool: అక్కడ ఏ పార్టీ కార్యక్రమాలు ఉన్నా బీఎస్పీ నేతలు అరెస్ట్ కావాల్సిందేనా?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫోటో)

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫోటో)

అధికార ప్రతిపక్షాల పార్టీ కార్యక్రమాలైనా, ఇతర ప్రధాన పార్టీల కార్యక్రమాలైనా పోలీసులు ముందస్తుగా బీఎస్పీ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారంటూ బీఎస్పీ నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...

(N. Naveen Kumar, News18, Nagarkurnool)

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు (Political parties) ఇప్పటి నుంచే పర్యటనలను, ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. సభలు సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యచరణను ప్రారంభించాయి. రాజకీయ పార్టీల కార్యక్రమాలు జోరందుకున్న నేపథ్యంలో నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అధికార ప్రతిపక్షాల పార్టీ కార్యక్రమాలైనా, ఇతర ప్రధాన పార్టీల కార్యక్రమాలైనా పోలీసులు ముందస్తుగా బీఎస్పీ (BSP) కార్యకర్తలను అరెస్టు (Arrest) చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన బీఎస్పీ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్​ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పోలీసులు ఈ అరెస్ట్‌లు చేస్తున్నారని కుమార్ ఆరోపిస్తున్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఎస్పీ నేత కొత్తపల్లి కుమార్
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఎస్పీ నేత కొత్తపల్లి కుమార్

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..

ఎన్నికల (Elections) హడావిడి నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు చురుగ్గా తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఎమ్మెల్యేలు మంత్రులను ఆహ్వానించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయిస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహించి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ (TRS) అభ్యర్ధిని గెలిపించాలని మంత్రి కేటీఆర్ (KTR) ప్రజలను కోరుతున్నారు. 8 ఏళ్ల పాటు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా పత్రికా ప్రకటనలు, నగరంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఓటర్లను తమవైపు తిప్పుకొనే పనిలోపడ్డారు టీఆర్ఎస్​ నేతలు.

రాష్ట్రంలో అధికారాన్ని సొంత చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ (BJP) నేతలు సైతం జిల్లాలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జాతీయ స్థాయి నాయకులతో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు తరచూ రాష్ట్ర నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు స్థానిక బీజేపీ నేతలు. గ్రామీణ స్థాయి నుంచి బీజేపీని బలపరిచేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ (Congress) సైతం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది. నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టేలా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నాగర్ కర్నూల్ జిల్లాలో ఇతర పార్టీల కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసులు ముందస్తుగా బీఎస్పీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీఎస్పీ నేతల ముందుస్తు అరెస్ట్..

ఇటీవల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సమయంలోనూ, బీజేపీ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనూ.. పోలీసులు బీఎస్పీ (BSP) నేతలను ముందస్తు అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. తాజాగా రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలోనూ బీఎస్పీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారని ఆ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్ పోలీసులపై మండిపడ్డారు. గతంలో బీసీ నాయకుల కార్యక్రమాల సందర్బంగా కూడా అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు తేడా తెలియకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు.  స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే ఈ ముందస్తు అరెస్ట్‌లు చేపడుతున్నారని ఆరోపించారు. అరెస్ట్‌ల పర్వాన్ని ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

వరంగల్ సభ సక్సెస్‌తో బీఎస్పీలో జోరు..

వరంగల్‌ (Warangal)లో ఇటీవల బీఎస్పీ నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని బీఎస్పీ కార్యకర్తలు ఫుల్ జోష్‌తో ఉన్నారు. జిల్లాలో ఎక్కడ ప్రజాసమస్యలు ఉన్నా బాధితుల తరపున పోరాటం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల సమస్యలపైనా గళం వినిపిస్తున్నారు బీఎస్పీ యువ నేతలు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటనలు చేపట్టి జిల్లా నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీని మరింత బలోపేతం చేయాలనీ దిశానిర్దేశం చేశారు.

First published:

Tags: Bsp, Local News, Nagarkurnool, Police arrest, Rs praveen kumar, Telangana Politics

ఉత్తమ కథలు