హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : జూన్ 2న పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రభంజనం? -బీజేపీ కేంద్రం ఆర్థిక ఆంక్షలపై కేసీఆర్ యుద్దభేరి?

CM KCR : జూన్ 2న పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రభంజనం? -బీజేపీ కేంద్రం ఆర్థిక ఆంక్షలపై కేసీఆర్ యుద్దభేరి?

సీఎం కేసీఆర్, పీఎం మోదీ (పాత ఫొటోలు)

సీఎం కేసీఆర్, పీఎం మోదీ (పాత ఫొటోలు)

వ్యూహాత్మక మౌనాన్ని వీడి, కేంద్రం తీరుకు, బీజేపీ నేతల జోరుకు ఇక బ్రేకులు వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ మేరకు ప్రభంజనం చోటుచేసుకోవచ్చనే చర్చ జరుగుతోంది.

అంశాల ప్రాతిపతిపదికన గట్టి పొలికల్ కౌంటర్లు ఇవ్వడంలో సిద్ధహస్తుడిగా పేరు పొందారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. 22 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో తనదైన వాక్పటిమతో ప్రత్యర్థుల నోళ్లు మూయించడంలో నెగ్గుకొచ్చిన గులాబీ బాస్.. తాజాగా తాను ఫోకస్ పెట్టిన జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించబోతున్నట్లు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ అదే కేసీఆర్.. తెలంగాణకు సంబంధించిన ఆర్థిక, రాజకీయ అంశాలపై మాత్రం గత రెండు నెలలుగా సైలెంట్ అయిపోయారనే వాదన వినిపిస్తోంది.

తెలంగాణ రుణసమీకరణకు అడ్డు చెబుతూ, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు కారణమైన కేంద్రం ఆంక్షలపై సీఎం కేసీఆర్ మౌనం వహించడం.. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలాంటి బీజేపీ బడా నేతలు తెలంగాణ గడ్డపై భారీ సభలు పెట్టి కల్వకుంట్ల కుటుంబాన్ని కడిగిపారేసినా కేసీఆర్ కౌంటరివ్వకపోవడం.. ఇన్నాళ్లూ తాను వేటినైతే తీవ్రంగా వ్యతిరేకించారో అవే కేంద్ర విధానాలు, పథకాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వరుస ఆమోదాలు తెలుపుతుండటం.. చర్చనీయాంశాలుగా మారాయి. అయితే, వ్యూహాత్మక మౌనాన్ని వీడి, కేంద్రం తీరుకు, బీజేపీ నేతల జోరుకు ఇక బ్రేకులు వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ మేరకు ప్రభంజనం చోటుచేసుకోవచ్చనే చర్చ జరుగుతోంది.

CM KCR | Centre : తెలంగాణలో ఆర్థిక సంక్షోభం? -జీతాలు, పథకాలకు నిధులు కటకట -చేబదుళ్లు, ఓడీపై దృష్టి!


హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వేదికగా జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల ప్రధాన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. కేంద్రం, బీజేపీ నేతలు తెలంగాణ ముందు నిలిపిన అనేక ప్రశ్నలకు కేసీఆర్ తన ప్రసంగంలోనే సమాధానాలు చెబుతారని తెలుస్తోంది. తెలంగాణ ఆర్థిక ఇబ్బందులు, వాటికి పరిష్కారాలు, బీజేపీ కేంద్రం పెద్దల విమర్శలకు కౌంటర్లు తదితర అంశాలతో కేసీఆర్ పదునైన ప్రసంగం చేస్తారని వినికిడి. నిజానికి అధికారిక కార్యక్రమమైన ఆవిర్భావ వేడుకల్లో అపొలిటికల్ అంశాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా, ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్ని రాజకీయ, ఆర్థిక క్లిష్ట పరిస్థుల నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం ఘాటుగానే ఉండబోతున్నట్లు సమాచారం.

PM Kisan Yojana : రైతులకు శుభవార్త.. నేడే బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు జమ


తెలంగాణ అప్పులకు కేంద్రం, ఆర్బీఐ అడ్డుపడటంతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడం, సాధారణ రెవెన్యూ ఖర్చులతోపాటు ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడటం, వడ్డీకి చేబదుళ్లు లేదా ఓవర్ డ్రాఫ్టు తీసుకోనిదే గట్టెక్కే పరిస్థితి లేదని మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. వీటిని ప్రభుత్వంగానీ, టీఆర్ఎస్ నేతలుగానీ ఖండిచకపోవడాన్ని బట్టి తెలంగాణలో నిజంగానే ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయా? అనే వాదన బలపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు బహిర్గతమైన తర్వాత తొలిసారి జనంలోకి వస్తోన్న సీఎం కేసీఆర్.. పబ్లిక్ గార్డెన్స్ వేదికగా ప్రభంజనం లాంటి ప్రసంగంతోనే క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.

CM KCR | Akunuri Murali : కాళేశ్వరం ప్రాజెక్టు మూసేయక తప్పదు : ఎందుకో చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్..


నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ పాల్గొనబోయే కార్యక్రమ ఏర్పాట్లను చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర అవతరణ వేడుకల ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌ను సీఎస్ ఇవాళ వీక్షించారు. తెలంగాణ డే సందర్భంగా సీఎం కేసీఆర్ జూన్ 2న పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు చేరుకుని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోనూ ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. ఆ రోజే తెలంగాణకు కేసీఆర్ కొత్త దిశానిర్దేశం చేస్తారనే అంచనాలున్నాయి.

First published:

Tags: Bjp, CM KCR, Telangana, Trs

ఉత్తమ కథలు