Home /News /telangana /

TS POLITICS SPECULATIONS ON TDP PRESIDENT CHANDRABABU NAIDU SUPPORT TO BJP IN TELANGANA ALLEGES YSRCP LEADER SAJJALA RAMAKRISHNA REDDY AK

BJP-TDP: మోదీ ముందు చంద్రబాబు అలాంటి ప్రతిపాదన ఉంచారా ? బీజేపీ ఒప్పుకుంటుందా ?

చంద్రబాబు, మోదీ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, మోదీ (ఫైల్ ఫోటో)

BJP-TDP: బీజేపీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో బీజేపీకి టీడీపీ సహకరిస్తుందనే ప్రతిపాదనను చంద్రబాబు మోదీ దృష్టికి తీసుకెళ్లారా ? తద్వారా మళ్లీ ఏపీ, జాతీయస్థాయిలో బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారా ? అనే ప్రచారం జోరందుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    2019 ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించిన టీడీపీ.. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ,(PM Modi) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమం వేదికగా మాట్లాడుకోవడంపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల తరువాత కలిసిన మోదీ, చంద్రబాబు.. ఆత్మీయ పలకరింపులతో పాటు దేశ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ప్రధాని మోడీ టీడీపీ (TDP) అధినేతతో చర్చించినట్లు తెలుస్తోంది.

    అయితే మోదీ, చంద్రబాబు భేటీపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈ భేటీలో తెలంగాణలో బీజేపీకి టీడీపీ సహకరించే విషయంలో చంద్రబాబు ప్రస్తావించారనే అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్రానికి ఏం రకంగా మేలు చేయాలనే దానిపై కాకుండా తనకు ఏ రకంగా మేలు జరుగుతుందనే దానిపైనే చంద్రబాబు దృష్టి పెడతారని సజ్జల మండిపడ్డారు. అయితే చంద్రబాబు నిజంగానే తెలంగాణలో బీజేపీకి సహకరించే అంశాన్ని ప్రధాని మోదీ దగ్గర ప్రస్తావించారా ? అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

    ఈ రాష్ట్రాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహలు రచిస్తోంది. ఇందుకోసం చేయాల్సివన్నీ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో బీజేపీకి టీడీపీ సహకరిస్తుందనే ప్రతిపాదనను చంద్రబాబు మోదీ దృష్టికి తీసుకెళ్లారా ? తద్వారా మళ్లీ ఏపీ, జాతీయస్థాయిలో బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారా ? అనే ప్రచారం జోరందుకుంది. అయితే టీడీపీ అధినేత ఈ రకమైన ప్రతిపాదన తెరపైకి తెచ్చినా.. బీజేపీ నాయకత్వం తెలంగాణలో ఆయన సహకారం తీసుకునేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చనే వాదన కూడా ఉంది.

    AP Politics: మరోసారి తెరపైకి నియోజకవర్గాల అంశం.. విభజన అలా వద్దన్న సాయిరెడ్డి..

    YS Jagan: ఒక్క రూపాయి తక్కువైనా ఊరుకునేది లేదు..! అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..

    తెలంగాణలో బీజేపీ నాయకత్వం టీడీపీ సహకారం తీసుకుంటే.. మళ్లీ కేసీఆర్చంద్రబాబును సాకుగా చూపి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే రకంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని తీవ్రంగా నష్టపోయిందనే భావన ఇప్పటికీ ఉంది. అందుకే ఏపీ మూలాలు ఉన్న పార్టీలతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవద్దని బీజేపీ గట్టి నిర్ణయించుకుందని.. ఒకవేళ టీడీపీ తెలంగాణలో సహకరిస్తామని ప్రతిపాదన చేసినా.. ఈ విషయంలో బీజేపీ మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉండదనే చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Chandrababu Naidu, Pm modi, Telangana

    తదుపరి వార్తలు