భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy)కి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కాగా మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీజేపీకి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆయనకు గత నెల 22న అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆ నోటీసులకు సంబంధించి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అధిష్టానం ఇచ్చిన నోటీసులు అందలేదని కోమటిరెడ్డి (Komati Reddy Venkata reddy) కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy)కి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
మునుగోడు ఉపఎన్నిక నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) కాంగ్రెస్ తో ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. బైపోల్ ప్రచారానికి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) రాలేదంటే ఆయన ఎంతగా అసంతృప్తితో ఉన్నారో అర్ధం అవుతుంది. వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) తమ్ముడు రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopl reddy) కాంగ్రెస్ ను కాదని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీనితో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయింది. ఇక ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. అయితే ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) అతని తమ్మునికి ఓటు వేయాలని ఆడియో టేప్ లు కలకలం రేపాయి. అలాగే మునుగోడులో కాంగ్రెస్ గెలవదని వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) బహిర్గతంగా మాట్లాడడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy)కి గత నెల 22న ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి 10 రోజుల సమయం ఇచ్చింది. కానీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. దీనితో ఆ నోటీసులు అందలేదని కోమటిరెడ్డి (Komati Reddy Venkata reddy) కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy)కి మరోసారి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. మరి ఈసారైనా షోకాజ్ నోటీసులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy)స్పందిస్తారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aicc, Bjp, Komatireddy venkat reddy, Politics, Telangana, Trs