తనకు వచ్చిన బీజేపీ ఆఫర్ నిజమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ మారాలని తనను బీజేపీ అనుబంధ సంస్థలు కోరామని ఆమె చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలో కూడా షిండే మోడల్ అమలు చేద్దామని వారు మాట్లడారని కవిత పేర్కొన్నారు. కానీ తెలంగాణలో షిండే మోడల్ నడవదని, ఆ ఆఫర్ ను మర్యాదగా తిరస్కరించానని తెలిపారు. అయితే ఆమె తనను సంప్రదించిన వారి పేర్లను మాత్రం కవిత బహిర్గతం చేయలేదు. కాగా కవితను బీజేపీలో చేరాలని సంప్రదించారన్న అంశాన్ని ఇటీవల టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించారు. తాజాగా కవిత కూడా బీపీ ఆఫర్ నిజమే అని మదీయ ముందు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో షిండేగా కవిత?
అయితే ఇటీవల మహారాష్ట్రలో షిండే రాజకీయాలు పెను సంచలనం రేపాయి. అలాగే తెలంగాణ రాజకీయాల్లోనూ షిండే ఉన్నారని బీజేపీ నాయకులు బహిరంగంగానే పలుమార్లు చెప్పారు. అయితే అది ఎవరు అనేది సమయాన్ని బట్టి బయటకు వస్తారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి 10 మంది వెళ్తారేమో. కానీ మహారాష్ట్రాలోలాగా తెలంగాణలో జరగదని అన్నారు. టీఆర్ఎస్ లో షిండే ఎవరు లేరని అన్నారు. అయితే తెలంగాణ బీజేపీ నాయకులు షిండేగా ఏకంగా కేసీఆర్ కుటుంబం నుంచే చూడాలనుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే ఆమెను సంప్రదించింది ఎవరు? అనేది బయటకు చెప్తే ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారేది.
షిండే మోడల్ అంటే?
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను తనతో తీసుకుపోయి తమదే శివసేన అని ప్రకటించుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. అటు ఉద్దవ్ ఠాక్రే వర్గం తమదే శివసేన అంటూ పట్టుబడ్డారు. దీనితో రాష్ట్రంలో బలపరీక్ష జరిగింది. షిండే బీజేపీతో కలిసి ఆ బలపరీక్షలో నెగ్గి ఏకంగా సీఎం సీటు ఎక్కారు. ఇప్పుడు తెలంగాణాలో కూడా షిండే తరహాలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకోవడమే షిండే మోడల్ కాన్సెప్ట్. ఇప్పుడు కవితకు కూడా ఇదే తరహా ఆఫర్ వచ్చినట్లు కవిత చెప్పుకొచ్చారు.
కాగా నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కవితపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫోన్ చేశారని నాకు కాంగ్రెస్ నుండి ఓ కాల్ వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలపై నేడు టీఆర్ఎస్ శ్రేణులు అర్వింద్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో సామాగ్రి, కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇక అర్వింద్ మాటలపై కవిత కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోమని, నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Eknath Shinde, Kalvakuntla Kavitha, Maharashtra, Telangana, Telangana Politics, Trs