హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల సంచలన నిర్ణయం..ఇకపై PCC చీఫ్ కార్యక్రమాలకు దూరం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల సంచలన నిర్ణయం..ఇకపై PCC చీఫ్ కార్యక్రమాలకు దూరం

తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పీసీసీ చీఫ్ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలని మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Telangana Congress Senior Leaders |  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పీసీసీ చీఫ్ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలని మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల హైకమాండ్ ప్రకటించిన కమిటీల అంశం ఓ కొలిక్కి వచ్చే వరకు పీసీసీ చీఫ్ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరం ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇకపోతే రేపటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి కూడా దూరంగానే వుండాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు నిర్ణయించుకున్నారు. కాగా నేడు భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఆయనపై కామెంట్స్ చేశారు. మంగళవారం మరోసారి నేతలు సమావేశం కానున్నట్టు తెలుస్తుంది.

Subsidy Loans: గుడ్‌న్యూస్.. మైనారిటీలకు సబ్సిడీ లోన్లు.. ఎల్లుండి నుంచే దరఖాస్తులు.. అర్హత వివరాలు ఇవే

సేవ్ కాంగ్రెస్ నినాదం ఎత్తిన సీనియర్లు..

భట్టి నివాసంలో భేటీ అయిన సీనియర్ నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. కొత్త కమిటీలలో 108 మంది ఉంటే అందులో 50 మంది వలస వచ్చిన వారే అని మండిపడ్డారు. టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మమ్మల్ని కోవర్టులుగా ముద్ర వేస్తున్నారు. అందుకే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చిన వారికి మధ్య పోరాటం జరుగుతుంది. వలస వచ్చిన వారి నుండి కాంగ్రెస్ ను సేవ్ చేయాలనే మేము చూస్తున్నాం. కాంగ్రెస్ ను హస్తగతం చేసుకోవాలనే వారి కుట్ర జరుగుతుంది. క్యారెక్టర్ లేని వాళ్ళు పార్టీని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము నాలుగు పార్టీలు మారి రాలేదు. అసలు కాంగ్రెస్ నాయకులం మేమే. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో తేల్చుకుంటామని సీనియర్లు తెలిపారు. వలస వాదులతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది. గెలిచే చోట డీసీసీ నియామకాలు ఆపారు. ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పదవులు వలస వాళ్లకే కేటాయించారని మండిపడ్డారు.

Kavitha: కేరళకు కల్వకుంట్ల కవిత ..ఎందుకో తెలుసా?

నేడు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నివాసంలో భేటీ అయిన నాయకులు రేవంత్ రెడ్డి (Revant Reddy)పై తిరుగుబాటును ప్రారంభించారు. పార్టీలో వలస వచ్చిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లపై కోవర్టులనే ముద్ర వేస్తున్నారు. అసలైన ఒరిజినల్ కాంగ్రెస్ తమదే. వలస వచ్చిన నాయకులతో పోరాటం చేస్తామని పరోక్షంగా రేవంత్ రెడ్డి (Revant Reddy)పై విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన నాయకులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు, జగ్గారెడ్డి, మధుయాష్కీ, కోదండరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండరెడ్డి ఉన్నారు.

కొత్త కమిటీల చిచ్చు..

టీపీసీసీ కొత్త కమిటీలను ఇటీవల AICC ప్రకటించింది. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, 18 మందితో కూడిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ ను మూడు విభాగాలుగా విభజించి బాధ్యతలు అప్పగించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ ను నియమించింది. అయితే ఇందులో టీడీపీ వాళ్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు.

First published:

Tags: Bhatti Vikramarka, Congress, Mp revanthreddy, Telangana, TS Congress

ఉత్తమ కథలు