తెలంగాణలో మళ్లీ జుంపింగ్ రాజకీయాలు మొదలైనట్లు తెలుస్తుంది. ఈటెల, రాజగోపాల్ రెడ్డి 2 రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. వీరు హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారని అందుకే బుజ్జగింపుకై ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందని వినిపిస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి (Marri Shasidhar Reddy ఢిల్లీలో ప్రత్యక్షం అవ్వడం ఇప్పుడు అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఆయన బీజేపీ నాయకురాలు డీకే అరుణతో కలిసి ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు. ఆయన పార్టీ మారేందుకే ఢిల్లీకి వెళ్లారని ప్రచారం జరుగుతుంది. కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్ న్యాయకత్వంపై మర్రి శశిధర్ (Marri Shasidhar Reddy తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని మర్రి శశిధర్ రెడ్డి (Marri Shasidhar Reddy ఖండించారు. తాను పార్టీ మారడానికి ఢిల్లీ రాలేదు. ఢిల్లీ రావడం నాకేం కొత్త కాదు. నా మనవడి స్కూల్ ఫంక్షన్ కోసం వచ్చానని తెలిపారు. పార్టీ మారుతున్న ప్రచారం నిజం కాదని తెలిపారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) ఆయన వెంట ఉన్నారన్న దానిపై మర్రి శశిధర్ రెడ్డి (Marri Shasidhar Reddy)క్లారిటీ ఇచ్చారు. నేను వచ్చిన విమానంలో డీకే అరుణ (DK Aruna) తో సహా అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. కానీ నేను పార్టీ మారుతున్న అంటూ వచ్చిన వార్తలు పుకార్లే అన్నారు. అయితే రేవంత్ రెడ్డి (Revant Reddy) టీపీసీసీ చీఫ్ అయిన దగ్గరి నుండి మర్రి శశిధర్ రెడ్డి (Marri Shasidhar Reddy అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి (Revant Reddy) తీరుపై పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ కూడా రేవంత్ కు వత్తాసు పలుకుతున్నారని మర్రి శశిధర్ రెడ్డి (Marri Shasidhar Reddy విమర్శించారు.
కొన్ని రోజులుగా శశిధర్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఆయన పాల్గొనకపోవడం ఇప్పుడు వచ్చే వార్తలకు మరింత ఆజ్యం పోస్తుంది. కాంగ్రెస్ లో ఇక ఇమడలేననే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Telangana, TS Congress