హోమ్ /వార్తలు /తెలంగాణ /

D Srinivas: నిన్న చేరిక.. నేడు రాజీనామా.. కాంగ్రెస్‌కు సీనియర్ నేత డీఎస్ లేఖ.. ఫ్యామిలీలో వివాదాలు

D Srinivas: నిన్న చేరిక.. నేడు రాజీనామా.. కాంగ్రెస్‌కు సీనియర్ నేత డీఎస్ లేఖ.. ఫ్యామిలీలో వివాదాలు

డి.శ్రీనివాస్‌ (File)

డి.శ్రీనివాస్‌ (File)

Telangana Politics: వయస్సు, ఆరోగ్యం కారణంగా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని డీఎస్ అన్నారు .తనను అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని పేర్కొన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత డి. శ్రీనివాస్(D Srinivas).. నేడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ పంపారు. ఆయన భార్య విజయలక్ష్మి కూడా ఇందుకు సంబంధించి మరో లేఖను విడుదల చేశారు. తన కుమారుడు సంజయ్‌కు ఆశీస్సులు అందించేందుకే తాను గాంధీభవన్‌కు వచ్చానని అన్నారు. తాను కాంగ్రెస్ (Congress) వాదినని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను కాంగ్రెస్‌లో చేరినట్టు భావిస్తే.. ఇది తన రాజీనామా లేఖగా భావించాలని కోరారు. వయస్సు, ఆరోగ్యం కారణంగా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని డీఎస్ అన్నారు .తనను అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని పేర్కొన్నారు.

అయితే డీఎస్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నట్టు లేఖ బయటకు రావడంపై ఆయన పెద్ద కుమారుడు సంజయ్ తప్పుబట్టారు. ఆయనతో బలవంతంగా లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు. తన సోదరుడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీరును పరోక్షంగా తప్పుబట్టారు. తన తండ్రి ఆరోగ్యం కాస్త కుదుటపడితే.. నిజామాబాద్‌కు తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నానని.. కానీ ఈలోపు తన సోదరుడు ఈ విధంగా చేస్తాడని అనుకోలేదని సంజయ్ ఆరోపించారు.

తన తండ్రికి ప్రాణహాని ఉందని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లికి ఏమీ తెలియదని.. ఆమె తన సోదరుడు చెప్పినట్టు వింటారని ఆరోపించారు. తన తండ్రి చుట్టుపక్కల ఉన్న వారిని నమ్మే పరిస్థితి లేదని పరోక్షంగా తన సోదరుడు అరవింద్‌పై ఫైర్ అయ్యారు. తన ఆరోపణలకు స్పందన రాకపోతే.. తాను దీనిపై ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Rajanna Siricilla: విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు పెంపుదలపై ప్రత్యేక శ్రద్ద!

Minister KTR: కేంద్రానికి శత్రు రాష్ట్రంగా తెలంగాణ ..మరోసారి కేటీఆర్ గరంగరం

మరోవైపు డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఉన్న లేఖపై సంతకం చేస్తున్నప్పుడు ఆయన ఒంటిపై గాయాలు ఉన్నట్టుగా కనిపించాయి. దీంతో వీడియోను చూస్తుంటే.. సంజయ్ చేస్తున్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చినట్టుగా ఉంది. అయితే డీఎస్ విషయంలో ఇంత వివాదం చెలరేగడంతో.. ఈ అంశంపై డీఎస్ చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: D Srinivas, Telangana

ఉత్తమ కథలు