హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu By Elections: బుజ్జగింపులు షురూ.. హైదరాబాద్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేతల సమావేశం

Munugodu By Elections: బుజ్జగింపులు షురూ.. హైదరాబాద్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేతల సమావేశం

రేవంత్ రెడ్డి​, మునుగోడు (ఫైల్​)

రేవంత్ రెడ్డి​, మునుగోడు (ఫైల్​)

హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్​ ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఇప్పటికే టికెట్ ఆశించిన ఆశావహులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుజ్జగించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రాబోతోంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ (TRS), బీజేపీ, కాంగ్రెస్ (Congress) తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సీటును గెలచుకుని తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) తమ ఆధిపత్యం రాబోతోందని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో(Telangana) ఇప్పటికీ తమదే పైచేయి అని నిరూపించేందుకు అధికార టీఆర్ఎస్ యత్నిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇందుకోసం మునుగోడు (Munugodu) ఉప ఎన్నికలను ఉపయోగించుకోవాలని.. ఇక్కడ తమ సర్వశక్తులు ఒడ్డాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్‌ ఆ స్థానం గెలిపించుకోవాలని సరైన అభ్యర్ధి కోసం ఏఐసీసీ ఓ సర్వేని కూడా నిర్వహించింది. అందులో ఆశావాహులు, అర్హుల పేర్లు ఎక్కువగానే ఉన్నపప్టికి పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తెను నిలబట్టడానికే అధిష్టానం మొగ్గు చూపింది.

  దీంతో కాంగ్రెస్‌ నేతలు (Congress leader) రేపటి నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్లనున్నారు. త్వరలో మునుకోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi) ని ప్రకటించడంతో ప్రచారంపై దృష్టి సారించారు. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad) గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఇప్పటికే టికెట్ ఆశించిన ఆశావహులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  (TPCC Chief revanth) బుజ్జగించారు. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు , బలరాం నాయక్ , దామోదర్ రెడ్డి , దామోదర రాజనర్సింహ, అంజన్​కుమార్ యాదవ్ ,సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, చెరకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా పార్టీ కోసం కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి.. ఇరువురు స్రవంతి, చలమల కృష్ణారెడ్డిలకు సూచించినట్టుగా తెలుస్తోంది. అంతర్గత సమస్యలు లేకుండా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. మునుగోడు టికెట్ ఆశించిన పల్లె రవి, కైలాష్ నేత‌తో కూడా రేవంత్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. ఇక, మునుగోడు టికెట్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా పాల్వాయి స్రవంతి చెప్పారు. అసలైన కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడటం లేదని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షలాంటిదని.. దీనిని ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతానని చెప్పారు.

  తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఉపఎన్నిక గెలుపు కంటే అభ్యర్ధి ఎంపికే అధిష్టానానికి శిరోభారంగా మారింది. నియోజకవర్గ పరిధిలో సోషల్ మీడియా సర్వేతో పాటు సీనియర్లు సైతం మాజీ మంత్రి పాల్వాయి స్రవంతి పేరు ప్రతిపాధిస్తే ...టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌,ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌ మాత్రం చల్లమల్ల కృష్ణారెడ్డికి మొగ్గు చూపారు. అయితే వీరిద్దరిలో ఎవర్ని మునుగోడు బైపోల్ బరిలోకి దింపితే బాగుంటుందనే అంశంపై కేసీ వేణుగోపాల్‌తో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్యనేతల సమావేశంలో మెజార్టీ సభ్యులు మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి పేరును ప్రతిపాధించడంతో లైన్ క్లియరైంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Munugodu By Election, Revanth Reddy, TS Congress

  ఉత్తమ కథలు