హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS-BJP పొత్తు గుట్టు రట్టు.. ప్రశాంత్ కిషోర్ రిపోర్టుతో ఇలా -ఆ మాటలకు KTR సిగ్గుపడాలి: సీతక్క

TRS-BJP పొత్తు గుట్టు రట్టు.. ప్రశాంత్ కిషోర్ రిపోర్టుతో ఇలా -ఆ మాటలకు KTR సిగ్గుపడాలి: సీతక్క

టీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కాంగ్రెస్ విమర్శలు

టీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కాంగ్రెస్ విమర్శలు

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ ఇన్నాళ్లూ రహస్యంగా సాగించిన పొత్తు వ్యవహారం రాహుల్ గాంధీ తాజా పర్యటనతో గుట్టు రట్టయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టుతో గులాబీ నేతలకు భయం పట్టుకుందని, కాబట్టే బీజేపీతో బాహాటంగా కలిసిపోయిందన్నారు.

ఇంకా చదవండి ...

టీఆర్ఎస్ పనితీరుపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టుతో ఆ పార్టీ నేతలకు భయం పట్టుకుందని, కాంగ్రెస్ గెలుపు తథ్యమని తెలిశాకే తమ రహస్యమిత్రురాలు బీజేపీతో ఇక బాహాటంగా కలిసిపనిచేస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ ఇన్నాళ్లూ రహస్యంగా సాగించిన పొత్తు వ్యవహారం రాహుల్ గాంధీ తాజా పర్యటనతో గుట్టు రట్టయిందని సీతక్క అన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మహబూబ్ నగర్ వచ్చి టీఆర్ఎస్ ను తిట్టిపోతే, అటు వెళ్లి సమాధానం చెప్పకుండా.. రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీని టీఆర్ఎస్ టార్గెట్ చేయడంతోనే వీళ్ల చీకటి వ్యవహారం బయటపడినట్లయిందని సీతక్క వివరించారు.

రాహుల్ తన ప్రసంగంలో ఎంఐఎం పార్టీని ఒక్కమాట అనకపోయినా తన మంత్రులైన టీఆర్ఎస్-బీజేపీ కోసం అసదుద్దీన్ ఓవైసీ మీడియా ముందుకొచ్చి అర్థంలేని సవాళ్లు చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కేటీఆర్ తప్పుడు మాటలు మాట్లాడారని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీ యువరాజు కాదని, దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం ఆయనదని, అదే కేసీఆర్ కుటుంబం మాత్రం అమరవీరుల త్యాగాలపై భోగాలు అనుభవిస్తున్నదని, సీఎం కాకుండానే హోదాలో కొనసాగుతున్నందుకు కేటీఆర్ సిగ్గుపడాలని సీతక్క ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీపై అతి తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు సీతక్క అదే స్థాయిలో కౌంటరిచ్చారు. ఆదివారం హన్మకొండలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మీడియా సమావేశంలో మాట్లాడారు. సీతక్క ఏమన్నారో ఆమె మాటల్లోనే..

CM KCR భవితవ్యంపై గురువు Chandrababu అంచనా? -అదే జరిగితే ఎంత డబ్బున్నా పనికిరాదంటూ..


‘‘రాహుల్ గాంధీ సందేశం ప్రజల్లోకి వెళితే ఎక్కడ తమకు స్థానం ఉండదేమోనని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. రాహుల్ గాంధీని యువరాజు అంటోన్న కేటీఆర్ ఒక విషయం మర్చిపోతున్నడు. రాజుల పాలన ఎలా ఉంటుందో ఈ తరానికి, ప్రస్తుత తెలంగాణ సమాజానికి చూపిస్తున్నది కేసీఆర్ కాదా? రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత మూడు సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా గాంధీ కుటుంబం వద్దనుకుంది. తెలంగాణ కోసం వేలాది మంది తల్లులు, విద్యార్థులు చేసిన త్యాగాలకు చెలించిపోయి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. మరి తెలంగాణ కోసం టీఆర్ఎస్ నాయకులు ఏం త్యాగాలు చేశారో చెప్పే దమ్ముందా?

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడే తేదీ ఇదే..


టీఆర్ఎస్ నేతలు ఒక్కరోజైనా పదవి లేకుండా ఉన్నారా? సెంటిమెంటును వాడుకొని పదవులు పొందారే తప్ప రాహుల్ గాంధీ కుటుంబం లాగా మీరు ఉన్నారా? తెలంగాణ కోసం బలైపోయిన అమరవీరుల సంఖ్య 1200 అని అధికారంలోకి రాకముందు, 400 అని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది ఎవరు? ఈ 8ఏళ్ల కాలంలో అమరవీరులకు, ఉద్యమకారులకు కనీసం గౌరవమైనా ఇచ్చారా? వాళ్ల బలిదానాల మీద కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తుండటం వాస్తవం కాదా? రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలుచేసింది, స్వతంత్రం కోసం పోరాడింది. తెలంగాణ ప్రజల కలను నిజం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. ఇక్కడ ఇంకా విచిత్రం ఏటంటే..

Rahul Gandhi: ఆ పని చేయకుండా రాహుల్ మాటకు విలువేది? -ఇంతకీ పార్టీలో ఆయన హోదా ఏంటి?


కేటీఆర్ బయటి నుంచి ఊడిపడి, వెనువెంటనే ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి అయ్యాడు. ఈయన లాగా రాహుల్ పదవువుల కోసం పాకులాడలేదు. నిజానికి తెలంగాణకు యువరాజులా ఎవరు వ్యవహరిస్తున్నారో ప్రజలకు తెలుసుకదా. పదవి లేకున్నా కేసీఆర్ కుటుంబంలో మంత్రి హోదాను అనుభవిస్తున్నది ఎవరో కూడా తెలుసు. పూర్తిస్థాయి రాజు కాకముందే కేటీఆర్ ముఖ్యమంత్రి హోదాను అనుభవిస్తుండటం వాస్తవమే కదా. రాహుల్ గాంధీ టూరిస్టు కాదు, కేటీఆరే ఎన్నికల టూరిస్టు. ఎన్నికలు ఉంటే తప్ప టీఆర్ఎస్ కు ప్రజలు గుర్తుకురారు. విద్యార్థులు, రైతులు మరణాలను మీరు ఆపలేకపోయినందుకు సిగ్గుపడాలి. ముఖ్యమంత్రి కాకుండానే హోదాను అనుభవిస్తున్నందుకు కేటీఆర్ సిగ్గుపడాలి.

RaGa Visit: ప్రశాంత్ కిషోర్ పీడను టీకాంగ్రెస్ వదిలించుకుందా? -సునీల్ కనుగోలు ఖాతాలో తొలి విజయం!


ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

Mahendra Raj: సాలార్‌జంగ్ మ్యూజియం, ప్రగతి మైదాన్ మరెన్నో నిర్మాణాల రూపకర్త మహేంద్ర రాజ్ ఇకలేరు..


తెలంగాన ఏర్పాటు సరిగా జరగలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న బీజేపీకి టీఆర్ఎస్ వత్తాసుగా నిలబడింది వాస్తవం కాదా? జేపీ నడ్డా మొన్న మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ ను తిట్టినట్లు నటిస్తే ఆయనను పల్లెత్తు మాట అనరు. అక్కడికెళ్లి కేటీఆర్ సభలు పెట్టడు. కానీ రాహుల్ గాంధీ మీదికి మాత్రం ఉరికొస్తున్నడు. టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఎంఐఎం పార్టీ. మజ్లిస్ ని రాహుల్ ఒక్క మాటా అనకున్నా అసదుద్దీన్ ఓవైసీకి ఏదో పొడుచొకిన వచ్చినట్లు మాట్లాడుతున్నడు. ప్రకాశ్ రాజ్ లాంటోళ్లు తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా కనిపించిన్రా? ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఒక్క రైతు కుటుంబాన్నైనా పరామర్శించారా?

Lock Upp | Munawar Faruqui: లాకప్ షో విజేత మునావర్.. రూ.20లక్షల క్యాష్: Kangana Ranaut


టీఆర్ఎస్ కేబినెట్ లో ఉన్నోళ్లంతా డమ్మీ మంత్రులు కాదా? కనీసం ఒక్క మంత్రికైనా స్వేచ్ఛ ఉందా? మీ కుటుంబీకులు తప్ప ఏ మంత్రికైనా విలువ ఉందా పార్టీలో? ఈ విషయం ప్రజలకు తెలీదా? గాంధీ భవన్ లో గాడ్సేలు అని కేటీఆర్ అంటున్నడు. నిజమైన గాడ్సేలు ఎవరో, గాడ్సేలతో అంటకాగుతున్నది టీఆర్ఎస్ వాళ్లే. 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తుపెట్టుకున్నప్పటి అభిప్రాయం ఇంకా అట్లనే ఉందా? మీరు మారితే మార్పు, ఇతరులు అభిప్రాయాలు మార్చుకుని పార్టీలు మారితే తప్పా? ఇదేం లెక్క కేటీఆర్? మీ హోదాకు గౌరవం తగ్గేలా మాట్లాడితే ఎట్లా?

CM KCR రాజు కాదు.. నెహ్రూ నుంచి మీదే రాజరికం.. మమ్మీ ప్రెసిడెంట్.. నువ్వు డమ్మీ: రాహుల్‌పై KTR ఫైర్


తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ద్వారా టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం ఒక్కటేనని తేటతెల్లం అయింది. జనం తిరగబడకముందే టీఆర్ఎస్-బీజేపీలు మేం మేం కొట్టాడుతున్నట్లుగా నాటకాలాడుతున్నారు. కానీ రాహుల్ మాత్రం స్పష్టంగా రైతుల కోసమే మాట్లాడారు. ఇతరుల త్యాగల మీద పదవులు అనుభవిస్తున్నది కేటీఆర్ కుటుంబం. గాడ్సేను చంపిన పార్టీలతో అంటకాగుతున్నది టీఆర్ఎస్. గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి వచ్చిన రాహుల్ గాంధీని టార్గెట్ చేయడంతోనే మీ సంగతి ఏందో తెలిసిపోయింది. టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం ఒకటే. ఫెయిర్ పాలిటిక్స్ చేసే దమ్ములేకే చీకటి పొత్తులు కొనసాగిస్తున్నారు’’అని సీతక్క అన్నారు.

First published:

Tags: Bjp, CM KCR, Congress, KTR, Minister ktr, MLA seethakka, Rahul Gandhi, Telangana, Trs, Warangal

ఉత్తమ కథలు