Home /News /telangana /

TS POLITICS SANGAREDDY MLA JAGGAREDDY ALLEGED THAT THE TRS PARTY WAS PLAYING A MIND GAME TO GET THE ANTI GOVERNMENT VOTE TO THE BJP PRV

Jaggareddy Press meet: ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి వెళ్లాలనే టీఆర్ఎస్​ పావులు కదుపుతోంది.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైల్ ఫోటో

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైల్ ఫోటో

కేసీఆర్ తీపి మాటలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తుంటే .. బండి సంజయ్ పనికిమాలిన మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నాడని  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో రాకుండా బీజేపీ, టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నాయన్నారు.

ఇంకా చదవండి ...
    కేసీఆర్ (KCR) తీపి మాటలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తుంటే .. బండి సంజయ్ పనికిమాలిన మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నాడని  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy MLA Jaggareddy) విమర్శించారు.  తెలంగాణ రాజకీయాల ప్రక్షాళన మొదలు పెట్టాలని రాహుల్ గాంధీ  (Rahul gandhi)నిర్ణయించారని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చెప్పారు. విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ..   సోనియా గాంధీ,  రాహుల్ గాంధీలు తెలంగాణ (Telangana)ను ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్‌గా జగ్గారెడ్డి అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు.. కాంగ్రెస్‌ను 15 లోక్‌సభ స్థానాల్లో గెలిపించి రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని ఆయన కోరారు.  రాహుల్ గాంధీ వరంగల్ సభను విజయవంతం చేయాలని  కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కోరారు.

    KCR కుటుంబానికి పదేళ్లు అధికారం ఇచ్చారని.. వాళ్లు సెటిల్ అయ్యారని అన్నారు జగ్గారెడ్డి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సెటిల్ కావాల్సి ఉందని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని అన్నారు జగ్గారెడ్డి.  ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ కి పూర్తి సమయం ఇస్తా అని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం తో ప్రజల ఆకాంక్షలు అమలు కాలేదని చెప్పారు.

    రుణమాఫీ చేస్తానని చెప్పి..

    సీఎం కేసీఆర్​ రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ హామీని నెరవేర్చలేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. వరికి గిట్టుబాటు ధర లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ వరి వేయొద్దు అనడంతో.. 40 శాతం రైతులు వరి వేయలేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ దాగుడు మూతలు ఆడుతున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి రైతుల పొట్ట కొట్టాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ కి పోవాలని టీఆర్‌ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందని జగ్గారెడ్డి ఆరోపించారు. వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారం లోకి రావాలని టీఆర్​ఎస్​ కుట్ర రాజకీయం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో రాకుండా బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) ప్లాన్ చేస్తున్నాయన్నారు. బండి సంజయ్ కి తు..తెలియదు..తా తెలియదని ఎద్దేవా చేశారు. టీవీలను పిలిచి బౌ భౌ అని అరుస్తారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాజకీయం చేసేదంతా బీజేపీ అధిష్టానమేనని విమర్శించారు.

    వచ్చే నెల తలపెట్టిన రాహుల్ గాంధీ సభకు రైతులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జగ్గారెడ్డి పార్టీ కార్యకర్తలను కోరారు. రాహుల్  నాయకత్వాన్ని తెలంగాణ లో బలోపేతం చేయాలని ప్రజలను ఆయన కోరారు. ఐదు లక్షల మందితో రాహుల్ గాంధీ సభ నిర్వహించనున్నట్టుగా జగ్గారెడ్డి చెప్పారు.

    ఇంటెలిజెన్స్​ నిద్ర మత్తులో ఉంది..

    నేరాలు,ఘోరాలు తెలంగాణలో పెరిగిపోయాయని జగ్గారెడ్డి అన్నారు. కొందరు పోలీసులు పోలీస్ స్టేషన్ లు ఎప్పుడో వదిలేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రోజు జరిగే ఘటనల్లో టీఆర్ఎస్ నేతలే నిందితులుగా ఉంటున్నారని జగ్గారెడ్డి అన్నారు. కోదాడలో టీఆర్ఎస్ కార్పొరేటర్ కొడుకు అత్యాచారం చేసినట్టు వార్తలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.  తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ నిద్ర మత్తులో ఉందని విమర్శించారు. ఇంటిలిజెన్స్ ఫెయిల్ అయ్యిందని మండిపడ్డారు. ఇన్ని నేరాలు జరుగుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు.. ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.  క్రైమ్ జరిగితే పోలీసుల కంటే ముందు...మీడియాకే తెలుస్తుందన్నారు. ఇంటలిజెన్స్ పై కేసీఆర్ సమీక్ష చేయాలని కోరారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bjp, Jaggareddy, Trs, TS Congress, Vote

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు