రాజకీయాల్లోని సీనియర్ నేతలు ఏం చేసినా అందులో ఓ వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం సక్సెస్ అవుతుందా ? లేదా ? అన్నది పక్కనపెడితే.. అంతిమంగా తాము అనుకున్న వ్యూహం సక్సెస్ కావాలనే దిశగానే వారి అడుగులు పడుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth Reddy) పూడ్చలేనంత గ్యాప్ ఉంది. రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఓ రేంజ్లో ఫైర్ అయిన జగ్గారెడ్డి (Jagga Reddy) .. కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి (Sangareddy) నుంచి పోటీ చేయబోనని.. ఆ స్థానంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం ఇస్తానని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు అందుకు ఒప్పుకోకపోతే.. తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని చెప్పుకొచ్చారు.అయితే ఉన్నట్టుండి జగ్గారెడ్డి ఇలా ఎందుకు ప్రకటించారనే దానిపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలోని బలమైన కాంగ్రెస్ నేతల్లో జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న తన కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ సీట్లు కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మెదక్ ఎంపీగా తన కుటుంబసభ్యులను బరిలోకి దింపాలని ఆయన అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా ? రేవంత్ రెడ్డి కారణంగా జగ్గారెడ్డికి అలాంటి ఛాన్స్ ఉంటుందా ? అన్నది చర్చనీయాంశంగా ఉంది.
అయితే సంగారెడ్డి సీటును తన కుటుంబసభ్యులకు అప్పగించడం ద్వారా తాను మెదక్ లోక్‌సభ నుంచి బరిలోకి దిగే అవకాశం దక్కుతుందని.. తనకు ఎంపీ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస అధిష్టానం కూడా పెద్దగా వెనకడుగు వేయకపోవచ్చని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. తాను మళ్లీ సంగారెడ్డి ఎమ్మెల్యేగా బరిలో దిగి తన భార్యకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరితే.. అప్పుడు టీపీసీసీతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ విషయంలో పునరాలోచన చేసే అవకాశం ఉంటుందని.. కానీ తాను మెదక్ ఎంపీగా పోటీ చేసి తన కుటుంబసభ్యులకు సంగారెడ్డి నుంచి పోటీ చేసే అవకాశం కావాలనుకుంటే అది దక్కొచ్చని ఆయన లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం.
Telangana politics : బతుకమ్మ పండుగను అవమానిస్తారా .. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ట్వీట్‌పై TRSనేతలు ట్రోల్
Governor Tamilisai: నన్ను అవమానించారు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
అందుకే ఈ రకంగా ఆయన ముందస్తుగా ప్రకటన చేసి ఉంటారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. రాహుల్ గాంధీ జోడో భారత్ పాదయాత్ర తెలంగాణలో సంగారెడ్డిలోనూ ఉండటంతో.. అక్కడే తన మనోగతాన్ని రాహుల్ గాంధీకి చెప్పి ఆయన నుంచి హామీ తీసుకునే ఆలోచనలో జగ్గారెడ్డి ఉన్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagga Reddy, Telangana