Home /News /telangana /

TS POLITICS SANGAREDDY CONGRESS MLA JAGGA REDDY MADE KEY COMMENTS ON THE SELECTION OF TRS RAJYA SABHA CANDIDATES MDK PRV

MLA Jagga reddy: ప్రజల రక్తాన్ని పీల్చి.. సొమ్ములు దాచుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటా..? టీఆర్ఎస్​పై జగ్గారెడ్డి ధ్వజం

జగ్గారెడ్డి, కేసీఆర్​ (ఫైల్​)

జగ్గారెడ్డి, కేసీఆర్​ (ఫైల్​)

టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) పార్టీలు అవగాహనతో పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి  (MLA Jagga reddy)ఆరోపించారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) పార్టీలు అవగాహనతో పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి  (MLA Jagga reddy)ఆరోపించారు.  ఎంపీ అసదుద్దీన్.. కాంగ్రెస్​ ఎంపీ​ రాహుల్​ గాంధీకి సవాల్​ చేయడమేంటని జగ్గారెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్​ పార్టీ అరుగుల మీద కూర్చున్న విషయం మర్చిపోయావా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లో పోటీ చేసి గెలిచే సత్తా తనకుందని.. అసదుద్దీన్​కు మెదక్​ (Medak)లో పోటీ చేసే దమ్ముందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.  మరోవైపు తెలంగాణలో ప్రజా పరిపాలన సాగడం లేదని.. బిజినెస్ పాలన నడుస్తోందని జగ్గారెడ్డి విమర్శించారు. శనివారం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ (CM KCR) ఢిల్లీకి వెళ్లారని.. ప్రధాని మోదీ (PM Narendra modi) హైదరాబాద్‌కు వస్తున్నారని.. ఇదేం రాజకీయమో అని అనుమానం వస్తుందన్నారు. ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో రాష్ట్రానికి వస్తే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వాగతం పలికారని చెప్పారు. కానీ మోదీ వచ్చే సమయంలో కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మోదీ పర్మిషన్‌తోనే కేసీఆర్.. హర్యానాకు వెళ్లారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అంతర్గతంగా అండర్ స్టాండింగ్‌తో ముందుకు వెళ్తున్నాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని ఈ మూడు పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు.

    ప్రజల రక్తాన్ని పీల్చారు..

    ఇక టీఆర్ఎస్​ రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల (Rajya sabha MP candidates) ఎంపికపై జగ్గారెడ్డి స్పందించారు. అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్ పార్టీ విలువలు పొగొట్టిందని ఆయన విమర్శించారు. హెటిరో పార్థసారధిని  (Hetero Parthasarathy)రాజ్యసభకు ఎందుకు ఎంపిక చేశారనేది ప్రశ్నార్థకం అని జగ్గారెడ్డి అన్నారు. పార్థసారథి కరోనా సమయంలో రెమిడిసివర్ తయారు చేసి ప్రజలను దోచుకున్నారని.. ప్రజల రక్తాని పీల్చి కోట్లు సంపాదించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఐటీ రైడ్స్‌లో రూ. 500 కోట్ల దొరికిన వ్యక్తికి కేసీఆర్ రాజ్యసభ సీటు ఇచ్చారని ఆయన విమర్శించారు.

    ఆ పైసలతోని కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని దుర్మార్గపు ఆలోచనలతోనే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రాజ్యసభ ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ప్రజలు సంతృప్తిగా జీవించడం లేదన్నారు. తెలంగాణలో రైతులు చచ్చిపోతే దిక్కులేదని విమర్శంచారు. తెలంగాణ రైతులకు ఇచ్చిన తర్వాత హర్యానా రైతులకు ఇస్తే బాగుంటుందన్నారు.

     బండి సంజయ్​కి విలువలేదు..

    మరోవైపు బీజేపీ చీఫ్​ బండి సంజయ్​పై కూడా జగ్గారెడ్డి విమర్శలు చేశారు. బండి సంజయ్‌ కేవలం మీడియేటర్ మాత్రమేనని ఆయన విమర్శించారు. సంజయ్ మాట విని కేసీఆర్‌ను ప్రధాని మోదీ జైలులో పెడతారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్‌కు మాటకు బీజేపీలో విలువ లేదని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ ఫేక్ పార్టీ.. బండి సంజయ్‌వి ఫేక్ మాటలు అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అని.. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టడం పార్టీ చరిత్రలో లేదని చెప్పారు జగ్గారెడ్డి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Jaggareddy, Mlc elections, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు