హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే.. పార్టీకి మరింత నష్టమా ?

Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే.. పార్టీకి మరింత నష్టమా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana News: వచ్చే నెలలో కేజ్రీవాల్ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారని.. ఆ సమయంలోనే కోదండరామ్ తన పార్టీ టీజేఎస్‌ను ఆప్‌లో విలీనం చేసి తెలంగాణలో ఆప్‌కు సారథ్యం వహిస్తారని వార్తలు వస్తున్నాయి.

రాజకీయాల్లో చోటు చేసుకునే పరిణామాలు కొన్ని పార్టీలకు లాభం చేకూర్చితే.. మరికొన్ని పార్టీలకు నష్టం కలిగిస్తుంది. తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కొంతకాలంగా చోటు చేసుకుంటన్న పరిణామాల కారణంగా బీజేపీ(Bjp) బలపడుతుంటే.. ఆ పార్టీపై పైచేయి సాధించేందుకు అధికార టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న హోరాహోరీ రాజకీయ పోరు కారణంగా కాంగ్రెస్(Congress) పార్టీ నష్టపోతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొన్నాళ్లుగా జరిగిన ఎన్నికలు, వాటిలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. అయితే రేవంత్ రెడ్(Revanth Reddy)డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. పరిస్థితులు మళ్లీ తమకు అనుకూలంగా మారతాయని బలంగా నమ్ముతోంది. నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల ఇతర పార్టీల వైపు మళ్లుతున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు మళ్లీ తమ వైపు వస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.

అయితే తాజాగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ఓ ప్రచారం కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఆ తరువాత తెలంగాణ జనసమితి పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించారు కోదండరామ్. అయితే ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపులేకపోతోంది. దీంతో టీజేఎస్ పార్టీని కోదండరామ్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం లేదని కోదండరామ్ క్లారిటీ ఇచ్చారు. తాము టీజేఎస్ తరపున రాష్ట్ర రాజకీయాల్లో పోరాటం చేస్తామని ప్రకటించారు.

తాజాగా కోదండరామ్ నేతృత్వంలోని టీజేఎస్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్‌లో విలీనమవుతుందనే చర్చ జరుగుతోంది. వచ్చే నెలలో కేజ్రీవాల్ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారని.. ఆ సమయంలోనే కోదండరామ్ తన పార్టీ టీజేఎస్‌ను ఆప్‌లో విలీనం చేసి తెలంగాణలో ఆప్‌కు సారథ్యం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కోదండరామ్ ‌మాత్రం స్పందించలేదు.

YSRTP:పాదయాత్రలోనే అభ్యర్ధుల పేర్లు ప్రకటన..అక్కడి నుంచి పోటీ చేస్తోంది ఎవరంటే..

Telangana Politics: కాబోయే జాతీయ పార్టీలో టీజేఎస్ విలీనం? -ప్రొ.కోదండరామ్ వ్యూహం ఇదేనా?

మరోవైపు కోదండరామ్ తన పార్టీలోని ఆప్‌లోని విలీనం చేసి.. తెలంగాణలో ఆప్‌కు సారథ్యం వహిస్తే.. ఆ ప్రభావం తమపై ఎంతవరకు ఉంటుందనే దానిపై కాంగ్రెస్‌లో టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది. కోదండరామ్ తెలంగాణలో ఆప్‌కు సారథ్యం వహించడం వల్ల తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీల తరహాలోనే కాంగ్రెస్‌కు నష్టపోతుందనే ఆందోళన ఆ పార్టీకి ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కోదండరామ్ తీసుకోబోయే రాజకీయ నిర్ణయం.. కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు ఇబ్బందిపెడుతుందన్నది చూడాలి.

First published:

Tags: Congress, Telangana

ఉత్తమ కథలు