(K.Veeranna,News18,Medak)
తెలంగాణ కాంగ్రెస్(Congress)లో ఆయనో ఫైర్ బ్రాండ్. పబ్లిక్‌లో ఆయనకు మాస్ లీడర్‌గా పేరుంది, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు. పార్టీలో నచ్చని విషయాన్ని బాహాటంగా చెప్పగలిగిన ఏకైక నేత. ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే ఎమ్మెల్యే(MLA) కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. అయితే ఆయన మౌనానికి పెద్ద కారణమే ఉందనే చర్చ జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే అతి త్వరలోనే ఆయన పార్టీ మారబోతున్నారనే చర్చ కూడా నియోజకవర్గంలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మెదక్(Joint Medak)జిల్లాకు చెందిన ఆ నేత నిర్ణయం ఎలా ఉండబోతుందన్నదే రాజకీయంగా చర్చనీయాంశమైంది.
నవంబర్ 5న టీఆర్ఎస్‌లోకి జగ్గారెడ్డి ..?
జగ్గారెడ్డి ఉరఫ్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి. సంగారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నుంచి గెలిచిన అతి తక్కువ మంది ఎమ్మెల్యేల్లో జగ్గారెడ్డి ఒకరు. టీఆర్ఎస్ హవా ఎంత గట్టిగా ఉన్నా ...తాను మాత్రం గెలవడం ఖాయమని బల్లగుద్ది చెప్పగలిగిన జగ్గారెడ్డి రాజకీయ అడుగులు ఇప్పుడు ఎటు పడుతున్నాయి అనేది సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తోంది. త్వరలోనే సంచలన ప్రకటన చేస్తానంటూ గత నెలలో స్టేట్‌మెంట్ ఇచ్చిన జగ్గారెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. జగ్గారెడ్డి చెప్పబోయే సంచలన ప్రకటన ఏమిటని నియోజకవర్గ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా గాంధీభవన్ వైపు వెళ్లకుండా , పార్టీ నేతల్ని కలవని జగ్గారెడ్డి రెండు, మూడ్రోజుల నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు.
సొంత పార్టీలో ఇమడ లేకేనా..!
సొంత పార్టీలో ఇమడ లేక నచ్చని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోనే విభేదాలు తెచ్చుకున్న జగ్గారెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్‌రెడ్డిపైనే పలుమార్లు విమర్శలు చేశారు. షడన్‌గా ఆయన సైలెంట్ అవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్‌ని వీడి...టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారనే వార్త బాగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం సోషల్ మీడియాతో పాటు ప్రముఖ ఛానల్లో కూడా వైరల్ గా మారింది. గతంలో తాను సంచలన ప్రకటన చేస్తానంటూ చెప్పిన జగ్గారెడ్డి నవంబర్ 5 తేదీన తన నిర్ణయాన్ని , రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో భాగంగనే నవంబర్ 5న టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లుగా ప్రకటిస్తారనే సమాచారం అందుతోంది.
కాంగ్రెస్ నుంచి మరో వికెట్ ఔట్ ..?
నియోజకవర్గ అభివృద్ధి కోసం మున్సిపల్ శాఖ మంత్రితో కేటీఆర్‌తో చర్చలు, మాట ముచ్చటలు కొనసాగించారు. ఆక్రమంలోనే జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నారనే చర్చ నడుస్తోంది. అలాగే పార్టీలో తన మాటకు విలువ లేదని భావిస్తున్న జగ్గారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అయితే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై జగ్గారెడ్డి స్పందిస్తారని అందరూ భావించినప్పటికి ఆయన నోరు మెదపకపోవడం చూస్తుంటే సంగారెడ్డి ఎమ్మెల్యే సైతం కమలదళంలో చేరిపోవడం ఖాయమని తెలుస్తోంది. దీనికి తోడు మునుగోడు ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతున్న రేవంత్‌రెడ్డి తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో ఉండే కంటే టీఆర్ఎస్‌లో చేరడమే బెటర్ అని భావిస్తున్నారని సమాచారం.
ఏం జరగబోతుందో ...
పరిస్థితులు, రాజకీయ విభేదాలు, వ్యక్తిగత ఇమేజ్, నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కంటే గుడ్ బై చెప్పి ..అధికార పార్టీలోకి మారితే బెటర్ అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.మీడియా, సోషల్ మీడియాలో ఇదే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే నవంబర్ 5న హస్తం గుర్తు పార్టీని వదిలి ... కారు ఎక్కడం ఖాయమనే మాట నియోజకవర్గంలోని జగ్గారెడ్డి అనుచరవర్గం నుంచే వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పొలిటికల్ స్టెప్స్ ఎటు పడతాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagga Reddy, Sangareddy, Telangana Politics