హోమ్ /వార్తలు /తెలంగాణ /

RGV: కేసీఆర్ ఆదిపురుష్..BRSపై ఆర్జీవీ సంచలన ట్వీట్..ఇది పొగడ్తా? విమర్శా?

RGV: కేసీఆర్ ఆదిపురుష్..BRSపై ఆర్జీవీ సంచలన ట్వీట్..ఇది పొగడ్తా? విమర్శా?

దసరా పండుగ రోజున కేసీఆర్ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన గులాబీ బాస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు అంటూ సంచలన ప్రకటన చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దసరా పండుగ రోజున కేసీఆర్ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన గులాబీ బాస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు అంటూ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా మరో జాతీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ బలంగా నమ్ముతూ కొత్త పార్టీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఇప్పటివరకు TRSగా ఉన్న పార్టీ ఇకపై BRS గా మారుస్తూ కేసీఆర్ సంతకం చేశారు. కేసీఆర్ కొత్త పార్టీపై పలువురు రాజకీయ నాయకులు, ఇతరులు స్పందిస్తున్నారు.

  ఇక తాజాగా కేసీఆర్ జాతీయ పార్టీపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న కేసీఆర్ కు స్వాగతం.  TRSను  BRS గా మార్చిన కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యాడంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వర్మ పొగిడాడా? విమర్శించారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: CM KCR, Ram Gopal Varma

  ఉత్తమ కథలు