హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: సర్కారుకు సగం బడ్జెట్‌కు సరిపడ డబ్బు తెచ్చింది ఆ మూడు శాఖలే..లెక్కలు ఇవిగో..

Telangana: సర్కారుకు సగం బడ్జెట్‌కు సరిపడ డబ్బు తెచ్చింది ఆ మూడు శాఖలే..లెక్కలు ఇవిగో..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మూడు శాఖలే డబ్బుల గనిగా మారాయి. ఏడాదిలో లక్ష కోట్ల ఆదాయం తెచ్చి పెట్టాయంటే శాఖల పనితీరు ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతేడాదితో పోలిస్తే 30శాతం అధికంగా వచ్చినట్లు అధికారిక లెక్కలు చూపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

తెలంగాణ (Telangana)రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లక్ష కోట్ల ఆదాయం వచ్చింది. కేవలం ఒక్క సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం తెచ్చి పెట్టాయి మూడు ప్రధానమైన శాఖలు. ఏ రాష్ట్ర సర్కారుకైనా ఖజానా నింపే ప్రధాన శాఖలు ఎక్సైజ్Excise, కమర్షియల్ ట్యాక్స్ (Commercial Taxes), స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ శాఖ(Registration and Stops)ల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శాఖలే భారీగా డబ్బులు తెచ్చిపెట్టాయని అధికారిక లెక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా వాణిజ్యపన్నులశాఖశాఖ ద్వారా సర్కారుకు 2021-22సంవత్సవరంలో 65వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే గతేడాది 2020-2021కంటే 13వేల కోట్ల ఆదాయం అదనంగా రావడం విశేషం. గతేడాది వ్యాట్, జీఎస్టీల రాబడి ఆదాయం 52,436కోట్లు వస్తే ఈ సంవత్సరం 65వేల కోట్ల రూపాయలు వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో రావడం ఇదే మొదటిసారి. కమర్షియల్ ట్యాక్స్‌శాఖ తర్వాత సర్కారు ఖజానాను నింపింది ఎక్సైజ్‌శాఖ. గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయని ప్రభుత్వ ఆదాయ లెక్కలే చూపిస్తున్నాయి. ఎక్సైజ్‌శాఖకు ట్యాక్స్‌ల రూపంలో 2021-22 ఏడాదిలో 30వేల కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగితే ఎక్సైజ్ ట్యాక్స్‌ కింద 17వేల కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది 2020-21లో 14వేల కోట్లు వస్తే..ఈసారి మరో మూడు వేల కోట్ల ఆదాయం పెరిగింది. ఇక రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా కూడా సర్కారుకు దండిగానే సంపాదన సమకూరింది. 2021-22ఏడాదికి గాను 12,364 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ..రెట్టింపు కంటే ఎక్కువగా వచ్చిందని సర్కారు లెక్కలు చూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్స్ శాఖకు 2020-21సంవత్సరంలో 5,260 కోట్లు వస్తే ..2021-22లో 12,364కోట్ల ఆదాయం వచ్చింది.

సగం బడ్జెట్‌ నింపాయి..

మూడు శాఖల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి గతేడాదితో పోలిస్తే రెట్టింపు ఆదాయం వచ్చిందనే చెప్పాలి. ఒక్క ఏడాదిలో సుమారు 94,500వేల కోట్ల ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చి పడింది .ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఫీజులతో పాటు భూముల మార్కెట్ విలువలు పెంచడంతో రాబడి పెరిగినట్లుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెల్లడించింది.

లక్ష కోట్ల ఆదాయం..

2020-2020 ఏదాడిలో సర్కారు ఖజానాకు ఈ మూడు శాఖల ద్వారా వచ్చిన ఆదాయం కంటే 23వేల కోట్లు ఆధికంగా వచ్చినట్లుగా సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈసారి ఆదాయం పెరగడంతో..రాబోయే సంవత్సరం సుమారు కోటి 20లక్షల కోట్ల ఆదాయం చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Telangana, Telangana govt

ఉత్తమ కథలు