Home /News /telangana /

TS POLITICS REVANTH REDDY VERSUS JAGGA REDDY EPISODE REACHES CLIMAX IN TELANGANA CONGRESS AK

రేపటి రోజు రేవంత్ రెడ్డిదా ? లేక జగ్గారెడ్డిదా ?.. తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్ టెన్షన్

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

ప్రస్తుతం జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. రాహుల్ గాంధీ సహా ఇతర కీలక నేతలెవరిని రేవంత్ రెడ్డి కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.

    తెలంగాణ కాంగ్రెస్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని(Jagga Reddy) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌తోపాటు పలు ఇతర బాధ్యతల నుంచి తొలగించింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో అసమ్మతి నేతలపై చర్యలకు కాంగ్రెస్ సిద్ధమైందనే సంకేతాలు వస్తున్నాయి. కొంతకాలంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. తమకు కాంగ్రెస్(Congress) అధిష్టానం అంటే గౌరవం ఉందని.. సోనియా, రాహుల్ తమ నాయకులని చెబుతూనే టీపీసీసీ చీఫ్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఈ కొత్త పంచాయతీ ఎటు వైపు దారి తీస్తుందో అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    కాంగ్రెస్‌లో ఇలాంటి పరిణామాలు సహజమే అయినా.. ఈసారి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పలువురు కాంగ్రెస్ నేతలు మరింత దూకుడు పెంచడం మరింత కీలకంగా మారింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు ఇతర బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు టీపీసీసీ ప్రకటించింది. ఆ వెంటనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది.

    ప్రస్తుతం జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. రాహుల్ గాంధీ సహా ఇతర కీలక నేతలెవరిని రేవంత్ రెడ్డి కలిసే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే రేపు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చెబుతానని జగ్గారెడ్డి ప్రకటించడంతో.. ఆయన ఏం చెబుతారు ? కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకుంటారా ? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

    KCR: ముందస్తు ఎన్నికలు లేవంటూనే.. పరిస్థితి అలా ఉందన్న కేసీఆర్.. 25 రోజుల తరువాత రిపోర్ట్..

    CM KCR | Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ సంచలన రహస్యాలు చెప్పిన కేసీఆర్.. ప్యాకేజీ రూ. 3వేల కోట్లు!

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన మరింత తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి ముందే ఆయనపై కాంగ్రెస్ అధినాయకత్వం వేటు వేసేంత స్థాయిలో నిర్ణయం తీసుకుంటుందా ? అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రచ్చ.. రేపు మరింత పతాకస్థాయికి చేరుకునే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Jagga Reddy, Telangana

    తదుపరి వార్తలు