TS POLITICS REVANTH REDDY SAYS THAT THEY WILL NOT MEET YASHWANT SINHA IF HE MEET CM KCR IN HYDERABAD AK
యశ్వంత్ సిన్హా కేసీఆర్‌ను కలిసి వస్తే.. మేం కలవబోం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో)
Revanth Reddy: తమను కలిసి కేసీఆర్‌ను కలిసినా.. టీఆర్ఎస్ను కలిసి తమను కలవాలని ప్రయత్నించినా ఒప్పుకోమని అన్నారు. ఆయన టీఎంసి అభ్యర్థి అని.. తమ పార్టీ అభ్యర్థి కాదని...మమత బెనర్జీ మద్దతు అడిగింది కాబట్టి కాంగ్రెస్ ఆయనకు సపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.
వచ్చే నెల 2న విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌కు వస్తున్నట్టు తమకు తెలిసిందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఆయన కేసీఆర్‌ను(KCR) కలిసి వచ్చిన తరువాత తాము ఆయనను కలవబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా వస్తే ఆయను కలిసేందుకు కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలొద్దు అని తాము ముందే చెప్పామని రేవంత్ రెడ్డి అన్నారు. తమను కలిసి కేసీఆర్‌ను కలిసినా.. టీఆర్ఎస్ను కలిసి తమను కలవాలని ప్రయత్నించినా ఒప్పుకోమని అన్నారు. ఆయన టీఎంసి అభ్యర్థి అని.. తమ పార్టీ అభ్యర్థి కాదని...మమత బెనర్జీ మద్దతు అడిగింది కాబట్టి కాంగ్రెస్ ఆయనకు సపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన కొండా విశ్వేశ్వర రెడ్డి తనకు మిత్రుడని.. పార్టీ మారేటప్పుడు తనకు చెబుతాడని అనుకుంటున్నానని తెలిపారు. ఆ పార్టీలో చేరిన కొద్దీ కాలం తరువాత ఆయనే వెనుదిరిగి చూస్తాడని కామెంట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రధాని మోదీ ఇక్కడ ఎందుకు పెట్టారో తెలంగాణ ప్రజలకు అర్ధం కావడం లేదని అన్నారు. గతంలో కాకినాడ సమావేశాల్లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేశారని.. ఉత్తరాదిన మూడు రాష్ట్రాల ఏర్పాటు చేసిన తెలంగాణ ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ బీజేపీ అని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడానికి కూడా మోదీ ముందుకు రాలేదని అన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ntpv థర్మల్ 4 వేల mg విద్యుత్ , ఐటీఐఆర్, సాగు నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లాంటి చట్టబద్ధంగా రావాల్సిన పనులు చేయలేదని ఆరోపించారు. గత 8 సంవత్సరాల్లో తెలంగాణకు మోదీ చిల్లి గవ్వ ఇవ్వలేదని ఆరోపించారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవి ఊడగొట్టి ఉపరాష్ట్రపతి ఇచ్చి ఉద్యోగం ఉడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తెలుగువారిని మోదీ అవమానిస్తున్నారని.. మనల్ని అవమానించిన మోదీ ఏ ముఖం పెటుకొని తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు. నరేంద్రమోదీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చిల్లర పంచాయతీలు పెట్టుకుంటున్నారని... ఫ్లెక్సీల కోసం కొట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలపై చర్చ పెట్టాలని.. కేసీఆర్ చిల్లర విషయాలు మానుకోవాలని సూచించారు. అగ్నిపథ్‌పై టీఆర్ఎస్ వైఖరి ఏంటనే దానిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.