టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ నెలాఖరు నుంచి పాదయాత్ర చేయాలని డిసైడయ్యారు. ఇందుకోసం ఆయన రూట్ మ్యాప్ రెడీ చేసుకోవడంతో పాటు కాంగ్రెస్‌లోని(Congress) తన అనుచరులు, సన్నిహితులకు స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో.. కచ్చితంగా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం. పాదయాత్ర(Padayatra) ద్వారా ప్రజల్లోకి వెళితే.. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలోనూ యాక్టివ్ చేసినట్టు అవుతుందని.. రాజకీయంగా దూసుకుపోతున్న బీజేపీకి చెక్ చెప్పినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అండ్ టీమ్ భావిస్తోంది. రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడంతో... కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని.. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పర్మిషన్ కూడా వస్తుందని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ గట్టిగా నమ్ముతోంది.
ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్‌గా మాణిక్ రావ్ థాక్రే రావడం.. ఆయన తెలంగాణలోని అందరిలో సమావేశం కావడం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రేవంత్ రెడ్డి పాదయాత్ర అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జ్ ముందు ఉంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ఒక్కరే పాదయాత్ర చేస్తే ఎలా.. ఆయనకు అనుమతి ఇవ్వడం ద్వారా కొత్త పంచాయతీ సృష్టించవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణలోని పలువురు సీనియర్లు, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న నేతలంతా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇస్తే.. తాము కూడా పాదయాత్ర చేస్తామని.. తమకు కూడా అనుమతి ఇవ్వాలని కొందరు ఇతర సీనియర్ నేతలు కూడా హైకమాండ్‌ను కోరే అవకాశం ఉంది.
Breaking News: తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతికుమారి..అధికారిక ఉత్తర్వులు జారీ
Maoist Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత మృతి
రేవంత్ రెడ్డికి అనుమతి ఇచ్చి.. ఇతర నేతలకు ఇవ్వకపోతే కొత్త సమస్య వస్తుందనే వాదనను సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. అయితే తాను అనుకున్న విధంగానే పాదయాత్రతో ముందుకు సాగాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. ఈ విషయంలో హైకమాండ్‌ను ఏదో రకంగా ఒప్పించాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీకి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana