హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: ప్రగతి భవన్‌పై మరోసారి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..

Revanth Reddy: ప్రగతి భవన్‌పై మరోసారి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana News: రేవంత్ రెడ్డి భూదందాలకు పాల్పతారంటూ అసెంబ్లీలో విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రగతి భవన్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా ? అని మంత్రి కేటీఆర్(KTR) ఆ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ప్రశ్నించారు. మరోవైపు ఈ విషయంలో ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతల కామెంట్లను పట్టించుకోని రేవంత్ రెడ్డి(Revanth Reddy).. మరోసారి ప్రగతి భవన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని ప్రకటించారు. ఇక రేవంత్ రెడ్డి భూదందాలకు పాల్పతారంటూ అసెంబ్లీలో విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

డ్రామారావు వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు(Kalvakuntla Kavitha) మియపూర్‌లో 500 కోట్ల విలువైన భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆదిత్య కన్ స్ట్రక్షన్‌కు ధరణితో పేరుతో భూమి బదలాయించారని ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ భూములను కేటీఆర్ , ఆయన మిత్ర బృందం కొల్లగొట్టిందన్నారు. తాను చేస్తున్న ఆరోపణలకు మంత్రి కేటీఆర్ విచారణకు సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. నిషేదిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుండి తొలగించారని.. ఆ భూములు ఎవరి పేరుమీద బదలాయించారో బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. తనపై అరోపణలు చేసేవారికి తాను సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

అంతకుముందు అసెంబ్లీ వేదికగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రగతి భవన్‌ పేల్చేయాలని రేవంత్‌ దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రగతి భవన్‌ పేల్చేయండని అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతం అంటూ విమర్మలు గుప్పించారు. రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, భట్టి విక్రమార్క ఇద్దరూ మంచి వాళ్లేనని.. కానీ సావాస దోషం వల్ల ఇద్దరూ అసెంబ్లీలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధ్య‌క్షుడేమో ధ‌ర‌ణి ర‌ద్దు చేస్తానని అంటారని.. కానీ తమ అధ్య‌క్షుడు అలా మాట్లాడ‌లేద‌ని శ్రీధ‌ర్ బాబు చెబుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ నాయ‌కుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావ‌డం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా కాకుండా పోతుందని అన్నారు.

TSRTC: పెళ్లిళ్ల సీజన్‌... టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్..!

PM Modi: మరోసారి ట్రెండింగ్‌లో ప్రధాని మోదీ జాకెట్‌.. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారీ..

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌ను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని స్ప‌ష్టం చేశారు. గ‌త ఆరేళ్లలో 30 ల‌క్ష‌ల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయితే ఈ ఏడాదిన్న‌ర కాలంలోనే 23 ల‌క్ష‌ల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయ్యాయని వివరించారు.

First published:

Tags: Revanth Reddy, Telangana