Home /News /telangana /

TS POLITICS REQUESTING THE PARTY CADRE AND LEADERS THAT NO ONE SHOULD LEAVE THE CONGRESS TPCC CHIEF REVANTH REDDY VIDEO RELEASE SNR

Revanth Reddy : కాంగ్రెస్‌ను ఎవరూ వీడొద్దు .. లీడర్స్ , క్యాడర్‌ని రిక్వెస్ట్ చేస్తున్న రేవంత్‌రెడ్డి వీడియో ఇదే

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Revanth Reddy : ఆయన మాటలో ఫైర్ తగ్గింది. గతంలో దూకుడు స్వభావంతో దూసుకెళ్లిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కసారిగా మెత్తబడ్డారు. నిన్నటి వరకు పార్టీలో ఎవరు పోయిన వచ్చిన నష్టం ఏమి లేదని కామెంట్స్ చేసిన నాయకుడు ఎందుకు ఇప్పుడు బుజ్జగింపులు, ప్రాధేయపడే పరిస్థితికి వచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
ఆయన మాటలో ఫైర్ తగ్గింది. గతంలో దూకుడు స్వభావంతో దూసుకెళ్లిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కసారిగా మెత్తబడ్డారు. నిన్నటి వరకు పార్టీలో ఎవరు పోయిన వచ్చిన నష్టం ఏమి లేదని కామెంట్స్ చేసిన నాయకుడు ఎందుకు ఇప్పుడు బుజ్జగింపులు, ప్రాధేయపడే పరిస్థితికి వచ్చారు. వరుస పరాజయాలు ఓవైపు.. పార్టీని వీడుతున్న వాళ్లు మరోవైపు. ఈ పరిణామాలే ఆయనలోని టెంపర్‌ని తగ్గించాయా అంటే రాజకీయ మేధావుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. టీపీసీసీ చీఫ్‌ (TPCC Chief)రేవంత్‌రెడ్డి(Revanth Reddy) రిలీజ్ చేసిన వీడియో(Video)పైనే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌(Political circle)లో చర్చ జరుగుతోంది.

Cyber crime : టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌ నైనా జైస్వాల్‌కు ఆ టైపు వేధింపులు.. పోకిరిని పట్టుకున్న పోలీసులు


ఉపపోరు విజయంపై ఉక్కిరిబిక్కిరి..
తెలంగాణ కాంగ్రెస్‌కు పట్టిన గ్రహణం ఇంకా వీడినట్లుగా కనిపించడం లేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటి కంటే ..రేవంత్‌రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ రేసుగుర్రంలా పరిగెడుతుందని అందరూ భావించారు. కాని పొలిటికల్ సీన్ చూస్తుంటే అందుకు రివర్సైనట్లుగా కనిపిస్తోందంటున్నారు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చాలా మంది సీనియర్లు. అందుకు ఒకటి రెండు కాదు చాలా ఉదాహరణలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో కీలకనేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడటం, మునుగోడు ఉపఎన్నికల అంశం తెరపైకి రావడంతో ఈ తరహా కామెంట్స్‌కి మరింత బలం చేకూర్చినట్లైంది. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారని ..రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నిన్నటి వరకు చెప్పిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి..షడన్‌గా అభద్రతతో కూడిన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ ఒక్క సీనియర్‌ నేత ఆయన వెంట నడవకపోవడం, పార్టీలో మారిన నేతలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలతో రేవంత్‌రెడ్డి గ్రాఫ్‌ అటు పార్టీలో ఇటు ప్రజల్లో తగ్గుతూ వస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

స్పీడు తగ్గించిన టీపీసీసీ చీఫ్ ..
అందుకే నల్లగొండ జిల్లాలో జరగబోయే మునుగోడు బై పోల్ విజయం రేవంత్‌రెడ్డికి ఛాలెంజ్‌గా మారింది. ప్రధాన పోటీ టీఆర్ఎస్‌, బీజేపీ మధ్యే ఉంటుందని చెప్పుకుంటున్న నేతల మాటలతో ఆయన కాస్త మెత్తబడ్డట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే స్వాతంత్య్ర దినోత్సవం రోజున పార్టీ నేతలు ఎవరూ ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనై కాంగ్రెస్‌ పార్టీని వీడవద్దని సూచిస్తూ వీడియో రిలీజ్ చేశారు. అంతే కాదు రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అనే చిన్న నమ్మకాన్ని క్యాడర్‌, లీడర్లలో కలిగిస్తూనే 8ఏళ్లు పార్టీకి సేవ చేసి చివరగా అధికారంలోకి వచ్చే సమయంలో వేరే పార్టీలో చేరి నష్టపోవద్దని సూచించడం వెనుక రేవంత్‌రెడ్డి బుజ్జగింపు తప్ప మరొకటి కాదని తెలుస్తోంది.బుజ్జగింపులకు కారణం అదేనా ..?
కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నల్గొండ జిల్లాలో బలమైన నేతగా ఉండటమే కాకుండా బీజేపీలో చేరి పోటీ చేస్తే కాంగ్రెస్‌ గెలుపు కష్టమనే రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. దీనికి తోడు అధికార టీఆర్ఎస్‌ కూడా బలమైన అభ్యర్ధితో పాటు అర్ధబలాన్ని ప్రయోగిస్తే ...నాగార్జునసాగర్, హుజురాబాద్‌ ఫలితాలే పునరావృతం అవుతాయనే ఆలోచనతోనే ఈవిధంగా క్యాడర్‌, లీడర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. అంతే కాదు నల్గొండ జిల్లాలో మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే జిల్లాలో హ్యాట్రిక్ ఓటమి చవి చూసిన పార్టీగా కాంగ్రెస్‌ నిలుస్తుంది. ముందు హుజూర్‌నగర్, తర్వాత నాగార్జునసాగర్, ఇప్పుడు మునుగోడు. ఇందులో ఒకటి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్ధానాన్ని పోగొట్టుకుంటే ..ఇప్పుడు రెండో సిట్టింగ్‌ సీటు ఓఢితే పార్టీకి బలమైన దెబ్బ తగలడంతో పాటు..క్యాడర్‌ నిరుత్సాహానికి లోనయ్యే పరిస్థితి ఉందని భావించే రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ అభ్యర్ధన వీడియోని రిలీజ్ చేశారని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

Telangana Congress: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచాయతీకి రేపటితో ముగింపు?.. ఆ నేత రాకతో..ఇప్పుడు దిగొచ్చారు సారు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మునుగోడు బైపోల్‌లో కాంగ్రెస్‌కి గెలుపు అత్యంత అవసరం. రాజగోపాల్‌రెడ్డి తర్వాత దాసోజు శ్రవణ్‌ సైతం కాంగ్రెస్‌ని వీడారు. నవంబర్‌ 5వ తేదిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం సంచలన ప్రకటన చేస్తారని ప్రకటించారు. మునుగోడులో కాంగ్రెస్ ఓడితే... రాజగోపాల్‌రెడ్డి బాటలో ఇంకా వలసలు పెరిగే అవకాశముందని భావించే సైఫ్‌ సైడ్‌గా రేవంత్‌రెడ్డి ఈ పొలిటికల్ స్ట్రాటజీని ఉపయోగించారని తెలుస్తోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Mp revanthreddy, Telangana Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు