Home /News /telangana /

TS POLITICS REASON BEHIND WHY PRAKASH RAJ DISAPPEARED FROM TELANGANA POLITICS AND KCR SURROUNDING AK

KCR: కేసీఆర్ ఆయనను పక్కనపెట్టినట్టేనా ? అసలెందుకు వచ్చారు ? ఎందుకెళ్లారు ?

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Prakash Raj: తెలంగాణ రాజకీయాలు, టీఆర్ఎస్ రాజకీయాల్లో ఆయన ఎవరికీ గుర్తుకు రావడం లేదు. దీంతో అసలు ప్రకాశ్ రాజ్ తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు తళుక్కుమన్నారు ? ఎందుకు తెరమరుగయ్యారు ? అనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది.

    రాజకీయాల్లోనూ అవసరాన్ని బట్టి పాత్రలు మారుతుంటాయి. అవసరం లేదని అనుకుంటే.. రాజకీయ నేతలు సైతం పలువురిని పక్కనపెడుతుంటారు. అసలు రాజకీయాల్లో కొందరు ఎందుకు తెరపైకి వస్తారు ? మళ్లీ ఎందుకు తెరమరుగైపోతారు ? అన్నది ఊహించడం కూడా కష్టమే అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రకాశ్ రాజ్‌ది దాదాపు అలాంటి పాత్రే. జాతీయ రాజకీయాల్లో ప్రకాశ్ రాజ్‌ది(Prakash Raj) బీజేపీ వ్యతిరేకవాదం. ఆయన రాజకీయ నాయకుడు కాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తుంటారు. అలాంటి ప్రకాశ్ రాజ్ కొన్నిసార్లు సీఎం కేసీఆర్‌తో (CM KCR) కూడా కలిశారు. కొద్ది నెలల క్రితం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన వెంట ఉన్నారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనూ పర్యటించారు.

    ప్రశాంత్ కిశోర్‌,(Prashant kishore) కేసీఆర్‌తో కలిసి తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు కారణమయ్యారు. ప్రకాశ్ రాజ్ గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని కొందరు.. ఆయనను కేసీఆర్ రాజ్యసభకు పంపుతారని మరికొందరు అప్పట్లో అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఆయన గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. అసలు తెలంగాణ రాజకీయాలు, టీఆర్ఎస్ రాజకీయాల్లో ఆయన ఎవరికీ గుర్తుకు రావడం లేదు. దీంతో అసలు ప్రకాశ్ రాజ్ తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు తళుక్కుమన్నారు ? ఎందుకు తెరమరుగయ్యారు ? అనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది.

    మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రులతో మంచి సంబంధాలు ఉన్న ప్రకాశ్ రాజ్‌కు జాతీయ రాజకీయ నేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతను అప్పగించాలని కేసీఆర్ అనుకున్నారని.. కానీ ఇప్పుడు తన వ్యూహం మారడంతో కేసీఆర్ ప్రకాశ్ రాజ్‌ను పక్కనపెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గతంలోనూ ప్రకాశ్ రాజ్ ఒకసారి ఇదే తరహాలో కేసీఆర్ పక్కన ప్రత్యక్షమయ్యారని.. ఆ తరువాత మళ్లీ కనుమరుగయ్యారని కొందరు గుర్తు చేస్తున్నారు.

    Revanth Reddy: పాదయాత్రపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన లెక్క ఇదేనా ?

    Telangana| May: టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. మే నెలలో మరింత హీటెక్కనున్న రాజకీయం

    కాబట్టి మళ్లీ ఆయన ఎఫ్పుడైనా తెలంగాణ రాజకీయాలు, కేసీఆర్ పక్కన ప్రత్యక్షమయ్యే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలా కేసీఆర్ అనుకున్నప్పుడో లేక ప్రకాశ్ రాజ్‌ కావాలనుకున్నప్పుడో రాజకీయ ముఖచిత్రంపై ప్రత్యక్షమైతే.. ఆయనను ఎవరూ పెద్ద సీరియస్‌గా తీసుకోరనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Prakash Raj, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు