టీఆర్ఎస్లో గ్రేటర్ హైదరాబాద్‌లో మంచి పట్టున్న నాయకుడిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు గుర్తింపు ఉంది. 2014లో టీడీపీ తరపున గెలిచిన టీఆర్ఎస్లో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav).. 2018లో పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మరోసారి మంత్రి పదవి చేపట్టారు. పార్టీ అధినాయకత్వానికి సన్నిహితంగా ఉండే తలసాని.. తన కుమారుడు తలసాని సాయికిరణ్‌కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంలోనూ సక్సెస్ అయ్యారు. కానీ కుమారుడిని ఎంపీగా గెలిపించుకోవడంలో మాత్రం తలసాని విజయం సాధించలేకపోయారు. అయితే పార్టీలో, సీఎం కేసీఆర్‌తో(CM KCR) తలసానికి మంచి సాన్నిహిత్యం ఉందని చాలామంది చెబుతుంటారు. గ్రేటర్ పరిధిలోని మంత్రి కావడం కూడా ఇందుకు మరో కారణం.
అయితే ఇటీవల ఆయనపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ప్లీనరీలో ఆయన, ఆయన కుమారుడు కేసీఆర్‌కు శాలువా కప్పి సన్మానించేందుకు వచ్చినప్పుడు కేసీఆర్ నిరాకరించారని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతనే విషయం ఎవరికీ తెలియకపోయినా.. తలసానిపై కేసీఆర్ అసంతృప్తికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లోని(Hyderabad) ఓ ఆలయంలో గవర్నర్ తమిళిసైకు సన్మానించారు మంత్రి తలసాని.
ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య గ్యాప్ తీవ్రంగా ఉన్న సమయంలో మంత్రి తలసాని ఇలా చేయడం కేసీఆర్‌కు కోపం తెప్పించిందని.. అందుకే కేసీఆర్ ఆయనపై సీరియస్‌గా ఉన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు తలసాని విషయంలో కేసీఆర్ అంత అసంతృప్తితో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయనే పుకార్ల షికారు చేస్తున్నాయి. మా అధ్యక్ష ఎన్నికల్లో తలసాని పరోక్షంగా మోహన్ బాబు ఫ్యామిలీకి సపోర్ట్ చేశారని.. తనకు సన్నిహితుడైన ప్రకాశ్ రాజ్‌కు కాకుండా మంచు ఫ్యామిలీకి తలసాని సపోర్ట్ చేయడం కూడా కేసీఆర్ అసంతృప్తికి కారణమనే చర్చ జరుగుతోంది.
TS Politics: తెలంగాణ మాజీమంత్రి మళ్లీ డైలమాలో పడిపోయారా ? ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?
Telangana: బండి సంజయ్‌తో మాజీ ఎంపీ భేటీ ? కాషాయ కండువా కప్పుకుంటారా ?
ఇక తన కుమారుడిని టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిని చేసేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారని. ఇందుకోసం ఆయన కొంతమంది టీఆర్ఎస్ కార్పొరేటర్లతో రహస్యంగా సమావేశం నిర్వహించారని టీఆర్ఎస్ నాయకత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తన కుమారుడికి పార్టీ పదవీ కోసం కార్పొరేటర్ల ద్వారా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తలసాని ప్రయత్నాలు చేయడం కూడా టీఆర్ఎస్ నాయకత్వానికి ఆయనపై అసంతృప్తి పెరగడానికి మరో కారణమనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Talasani Srinivas Yadav, Telangana