తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలకు కొదవలేదు. వీరిలో కొందరి మధ్య ఆధిపత్య పోరు ఉంటే.. మరికొందరి మాత్రం విభేదాలకు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయనే వాదన ఉంది. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి(Uttam Kumar Reddy) మధ్య కూడా విభేదాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. అసలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న సీనియర్లకు అండగా ఉందని.. వారి వాయిస్‌ను ఢిల్లీలో బలంగా వినిపిస్తోంది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌పై(Telangana Congress) రేవంత్ రెడ్డి పట్టు సాధించకుండా ఉండేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా చేస్తున్నారనే వాదన ఒకవైపు.. తాము పోటీ చేయబోయే సీట్లను వేరే వాళ్లకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించడం వల్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనపై అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాలు ఉన్నాయి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి గతంలో హుజూర్ నగర్, కోదాడ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహించారు. మళ్లీ రెండు సీట్లలో తాను, తన భార్య పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఉత్తమ్. అయితే ఈసారి కోదాడ సీటును పద్మావతికి రాకుండా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు ఉత్తమ్ అనుమానిస్తున్నారట.
కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలన్న కాంగ్రెస్ నిబంధనను అనుకూలంగా మలుచుకుని ఈ రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెక్ చెప్పాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహమనే వాదన ఉంది. అయితే గతంలో ఈ సీట్ల నుంచి తాము పోటీ చేసి గెలిచామనే భావనలో ఉన్న ఉత్తమ్.. మళ్లీ ఈ సీట్లు తమవే అని పదే పదే ప్రకటించుకుంటున్నారు. కోదాడ, హుజూర్ నగర్ నుంచి మళ్లీ తాను, తన భార్య పద్మావతి పోటీ చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు. సాధారణంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఈ రకమైన వ్యాఖ్యలు చేయరు.
తెలంగాణ పథకాలు భేష్.. తమిళనాడు ఎమ్మెల్యేల కితాబు
Hyderabad: తెలంగాణ డీజీపీ ఏపీకి వెళ్లిపోవాల్సిందే.. ఎమ్మెల్యే రఘునందన్ సంచలన వ్యాఖ్యలు
కానీ వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఫ్యామిలీ కోటా నుంచి కోదాడ లేదా హుజూర్ నగర్ లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ప్లాన్ చేస్తుండటంతో.. ఆయన ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని కాంగ్రెస్‌లోని ఓ వర్గం చర్చించుకుంటోంది. ఇలా చేయడం వల్ల ఉత్తమ్ దూకుడుకు చెక్ చెప్పొచ్చని రేవంత్ రెడ్డి భావిస్తుంటే.. రేవంత్ రెడ్డి స్పీడ్‌కు ఇప్పటి నుంచే బ్రేకులు వేయడం ద్వారా ఆయన ఆధిపత్యానికి చెక్ చెప్పాలని ఉత్తమ్ అనుకుంటున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించని ఆధిపత్య పోరాటంలో చివరికి ఎవరిది పైచేయి అవుతుందన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.