హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా కేటీఆర్.. అలాంటి సంకేతాలు ఇస్తున్నారా ?

KTR: బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా కేటీఆర్.. అలాంటి సంకేతాలు ఇస్తున్నారా ?

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KTR-BRS: బీఆర్ఎస్ కీలక కార్యక్రమాలకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తరువాత జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. ఆ నోటి వెంట జై తెలంగాణ నినాదం స్థానంలో జై భారత్ నినాదం వచ్చింది. బీఆర్ఎస్‌ను జాతీయస్థాయిలో బలోపేతం చేయడం విషయంలో కేసీఆర్(KCR) ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా... టీఆర్ఎస్ తరహాలోనే బీఆర్ఎస్‌ కూడా విజయవంతం అవుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్(BRS) తరపున తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కీలక కార్యక్రమాలకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్(KTR) దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది.

టీఆర్ఎస్‌ బీఆర్ఎస్‌గా మారేందుకు తీర్మానం చేసే సమయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన కేటీఆర్ .. ఆ తరువాత పలు కీలక భేటీలకు దూరంగా ఉన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, ఏపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరే సందర్భంతో పాటు ఇటీవల బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిర్వహించిన ఖమ్మం సభకు కూడా కేటీఆర్ దూరంగా ఉన్నారు. కేటీఆర్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్లే ఆయన వీటికి హాజరుకాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే కేటీఆర్ కావాలనే వీటికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. జాతీయ రాజకీయాలపై కేటీఆర్‌కు ఆసక్తి లేదని.. అందుకే బీఆర్ఎస్‌కు సంబంధించిన పలు కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా.. తాను కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమనే సంకేతాలు ఇవ్వడానికే కేటీఆర్ ఇలా చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది.

తెలంగాణ పథకాలు భేష్.. తమిళనాడు ఎమ్మెల్యేల కితాబు

Hyderabad: తెలంగాణ డీజీపీ ఏపీకి వెళ్లిపోవాల్సిందే.. ఎమ్మెల్యే రఘునందన్ సంచలన వ్యాఖ్యలు

భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ జాతీయస్థాయి కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉండొచ్చని.. అదే జరిగితే తాను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమనే సంకేతాలను కేటీఆర్ ఇచ్చినట్టు స్పష్టమవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. ఇక్కడ ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటారని బీఆర్ఎస్ నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తరువాత ఇదే జరుగుతుందనే వాదన కూడా ఉంది. అందుకే కేటీఆర్ తెలంగాణకు పరిమితమయ్యే విధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

First published:

Tags: BRS, KTR, Telangana

ఉత్తమ కథలు