హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: కీలక భేటీకి దూరంగా కేసీఆర్.. ఆ కారణం నిజం కాదా ? పక్కా క్లారిటీతోనే ఉన్నారా ?

KCR: కీలక భేటీకి దూరంగా కేసీఆర్.. ఆ కారణం నిజం కాదా ? పక్కా క్లారిటీతోనే ఉన్నారా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR Plan: జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్.. ఇక ఇతర పార్టీలతో కలిసి పని చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకంగా మారుతుంటాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కోసం మమత బెనర్జీ (Mamata Banerjee)సారథ్యంలో నిర్వహించబోతున్న సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి సీఎం కేసీఆర్ ఈ భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా పెద్ద విషయమే. ఎందుకంటే సీఎం కేసీఆర్(CM KCR) బీజేపీని(BJP) వ్యతిరేకించే మమత బెనర్జీతో పలుసార్లు సమావేశమయ్యారు. ఆమెతో కలిసి పని చేయాలని కూడా అనుకున్నారు. ఇక ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్‌కు రాజకీయంగా సాన్నిహిత్యం ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. కేసీఆర్ మాత్రం ఈ భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

  ఈ భేటీకి కేసీఆర్ వెళ్లకున్నా.. పార్టీ తరపున ప్రతినిధులను పంపుతారని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈ భేటీకి తమ పార్టీ దూరంగా ఉంటుందని ప్రకటించారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయంగా తాము వ్యతిరేకించే కాంగ్రెస్ ఇందులో భాగస్వామి అవుతుండటంతో పాటు ముందుగానే అభ్యర్థిని నిర్ణయించి సమావేశం నిర్వహించడాన్ని టీఆర్ఎస్ తప్పుబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరో ప్రత్యేకమైన కారణం ఉందని సమాచారం.

  జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్.. ఇక ఇతర పార్టీలతో కలిసి పని చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసమే ఆయన ఇతర పార్టీలన్నీ కలిసి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్న అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడ్డారని.. అయినా బీజేపీ నిలిపే అభ్యర్థి కచ్చితంగా గెలిచే అవకాశం ఉందని తెలిసినా.. ఈ రకమైన ప్రయత్నాలు చేయడం ఎందుకు అనే భావనలో కూడా కేసీఆర్ ఉన్నట్టు కొందరు చర్చించుకుంటున్నారు.

  Telangana politics: అప్పుడు ప్రగతిభవన్​.. ఇపుడు రాజ్​భవన్​​.. తెలంగాణలో సమస్యల పరిష్కార వేదిక మారిందా?

  KCR| Telangana: కేసీఆర్‌కు ముందు సరికొత్త సవాల్.. కాంగ్రెస్, బీజేపీ వెయిటింగ్..

  అయితే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయనకు మమత బెనర్జీకి రాజకీయంగా దూరంగా పెరిగే అవకాశం ఉందని.. తనతో కలిసి రాని కేసీఆర్‌కు ఆమె భవిష్యత్తులో రాజకీయంగా మద్దతు తెలిపే ఛాన్స్ లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మమత బెనర్జీ నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉంటున్న కేసీఆర్.. ఈ కూటమి నిలపబోయే అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు