హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: మునుగోడు అభ్యర్థిపై ఇంకా తేల్చని కేసీఆర్.. అసలు వ్యూహం ఇదేనా ?

KCR: మునుగోడు అభ్యర్థిపై ఇంకా తేల్చని కేసీఆర్.. అసలు వ్యూహం ఇదేనా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR| Munugodu: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ నిర్వహిస్తున్న సమీక్షల్లోనూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొంటున్నారు. దీంతో ఆయన పోటీపై టీఆర్ఎస్‌ శ్రేణులకు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కొద్దిరోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలుకాబోతోంది. అధికార టీఆర్ఎస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ ఈ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. టీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తమ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. నిన్ననే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్.. మునుగోడులో విజయం సాధించడం ద్వారా బీఆర్ఎస్‌కు(BRS) తొలి విజయం అందించాలని అనుకుంటున్నారు. ఈ విజయం ద్వారా పార్టీ పేరు మార్పుపై తన నిర్ణయం వ్యూహాత్మకంగా సరైనదే అనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని భావిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. మునుగోడులో(Munugodu) పోటీ చేయబోయే టీఆర్ఎస్ అభ్యర్థి విషయంపై మాత్రం కేసీఆర్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. మునుగోడు నుంచి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(Kusukuntla Prabhakar Reddy) పోటీ చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి.

  మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ నిర్వహిస్తున్న సమీక్షల్లోనూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొంటున్నారు. దీంతో ఆయన పోటీపై టీఆర్ఎస్‌ శ్రేణులకు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేసీఆర్ మాత్రం ఆయన పేరును అధికారికంగా ప్రకటించే విషయంలో జాప్యం చేస్తున్నారు. అయితే ఇది వ్యూహాత్మకమే అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. నిజానికి కేసీఆర్ అనుకుంటే.. బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన దసరా రోజే మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించడానికి పెద్దగా ఇబ్బందేమీ ఉండేది కాదు. కానీ కేసీఆర్ అలా చేయలేదు. దీనికి ప్రధాన కారణం మునుగోడు ఉప ఎన్నిక రేసులో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటే టీఆర్ఎస్ పార్టీగానే జనంలోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తుండటమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై నియోజకవర్గంలోని టీఆర్ఎస్ వర్గాల్లో కొంతమేర వ్యతిరేకత ఉంది. ఈ విషయం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు స్థానిక నేతలు. అభ్యర్థిగా ఆయనకు బదులు మరో నేతను ఎంపిక చేయాలని కేసీఆర్‌ను కోరారు. కానీ కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. అయితే ఆయన పేరును ప్రకటించే విషయంలో మాత్రం వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు.

  Election Commission: కేసీఆర్ 'BRS'కు బిగ్ షాక్..పోటీగా మరో 3 పార్టీలు ఉన్నాయన్న కేంద్ర ఎన్నికల సంఘం

  Good News: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభవార్త..మరో 3 నెలలు ఫ్రీ రేషన్ పొడగింపు

  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరుతో సంబంధం లేకుండా టీఆర్ఎస్ పార్టీ పేరు మీదే మునుగోడు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ఇలా చేయడం వల్ల పార్టీ అభ్యర్థి ఎవరనే అంశం కంటే ఎక్కువగా పార్టీ ప్రజల్లోకి వెళుతుందని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. మునుగోడులో పార్టీ అభ్యర్థిని కేసీఆర్ ఇంకా ప్రకటించకపోవడానికి కారణం కూడా ఇదేననే కొందరు విశ్లేషిస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Munugodu, Telangana

  ఉత్తమ కథలు