బీఆర్ఎస్‌లో మంత్రి మల్లారెడ్డికి(Minister Malla Reddy) వ్యతిరేకంగా పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమైన విషయం తెలిసిందే. మంత్రి నామినేటెడ్ పదవులను కేవలం తమ నియోజకవర్గానికి చెందిన వారికి మాత్రమే ఇప్పించుకుంటున్నారని.. ఇలా చేస్తే తమ కేడర్‌కు తాము ఏమీ సమాధానం చెప్పుకోవాలని ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, భేతి సుభాష్ రెడ్డి, వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు వంటి వాళ్లు బాహాటంగానే ప్రశ్నించారు. మల్లారెడ్డి తీరుపై కాస్త తీవ్రంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే బీఆర్ఎస్‌లో(BRS) ఎమ్మెల్యేలు ఈ రకంగా అసంతృప్తిని వెళ్లగక్కడం.. ఈ రకంగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ఎప్పుడూ కనిపించలేదు. ఆ మాటకొస్తే సమావేశం ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువమంతి మంత్రి కేటీఆర్‌కు(KTR) సన్నిహితులుగా పేరుంది.
అలాంటి ఎమ్మెల్యేలు మార్కెట్ కమిటీ చైర్మన్ అనే చిన్న పదవి కోసం ఈ స్థాయిలో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారా ? అనే చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేలు పైకి చెబుతున్న విషయం ఎలా ఉన్నా.. మల్లారెడ్డికి వ్యతిరేకంగా పార్టీ నాయకత్వం స్థాయిలోనే ఈ రకమైన సమావేశం జరిగిందనే టాక్ వినిపిస్తోంది.
కొద్దిరోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి ఇల్లు, ఆఫీసులపై ఐటి దాడులు జరిగాయి. ఈ రకమైన దాడులకు తాము భయపడబోమని మల్లారెడ్డి కూడా ప్రకటించారు. అయితే మల్లారెడ్డి ఇప్పుడు కాకపోయినా.. రాబోయే రోజుల్లో బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇంకాస్త ఎక్కువగా టార్గెట్ చేస్తే.. మల్లారెడ్డి బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోందని.. అందుకే ఆయనను ఈ రకంగా పార్టీ పరంగానే ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
T-Congress: తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్..కీలక నేతను రంగంలోకి దింపిన ఏఐసీసీ
Minister Mallareddy: ఎమ్మెల్యేల భేటీపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి..ఏమన్నారంటే?
చిన్న చిన్న పదవుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకమైన సమావేశాలు పెట్టుకోవడం.. అందులోనూ కేసీఆర్ సారథ్యంలోని పార్టీలో ఈ రకమైన భేటీలు జరగడం ఏంటని కొందరు చర్చించుకుంటున్నారు. పార్టీ నాయకత్వం సపోర్ట్ లేకుండా.. మంత్రి మల్లారెడ్డిని ఎమ్మెల్యేలు ఈ రకంగా టార్గెట్ చేసే అవకాశం ఉండదనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి మల్లారెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం వారికి వారుగానే ఏర్పాటు చేసుకున్నారా ? లేక పార్టీ నాయకత్వం హస్తం ఉందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.