హోమ్ /వార్తలు /తెలంగాణ /

Etela Rajendar: ఈటల రాజేందర్‌కు అమిత్ షా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారా ?

Etela Rajendar: ఈటల రాజేందర్‌కు అమిత్ షా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారా ?

అమిత్ షాతో ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

అమిత్ షాతో ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

TS Politics: ఈటల రాజేందర్ ప్రయత్నాలను టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోందని.. అందుకే కమలం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు సాధ్యపడటం లేదనే వాదన వినిపిస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షా.. విమోచన దినోత్సవ వేడుకలతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మాజీమంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌తో కొద్దిసేపు అమిత్ షా(Amit Shah) ఏకాంతంగా చర్చలు జరపడం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో అసలు అమిత్ షా ఈటల రాజేందర్ ఏ చర్చించి ఉంటారనే అంశంపై బీజేపీ వర్గాల్లో అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్(Etela Rajendar) ఇటీవల అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. దీని గురించి ఆయన ప్రస్తావించారని కొందరు భావిస్తున్నారు. అయితే ఈటల రాజేందర్ తెలంగాణలో(Telangana) చేరికల కమిటీకి కన్వీనర్‌గా ఉన్నారని.. దానిపైనే అమిత్ షా ఆయనతో చర్చించి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  తెలంగాణలో బీజేపీలోకి చేరికలను పెద్ద ఎత్తున ప్రొత్సహించాలని బీజేపీ భావించింది. ఇందుకోసం గతంలో ఇంద్రసేనారెడ్డితో ఉన్న కమిటీని రద్దు చేసి.. కొత్తగా ఈటల రాజేందర్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి పార్టీలోకి చేరికలు వచ్చేలా ఈటల రాజేందర్ పని చేస్తారని బీజేపీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. అలా చేయడం వల్ల అధికార పార్టీ బలహీనపడటంతో పాటు బీజేపీ బలపడుతుందన్నది వారి వ్యూహం. అయితే ఈటల రాజేందర్‌ను చేరికల కమిటీకి చైర్మన్‌ను చేసిన తరువాత టీఆర్ఎస్ కూడా అప్రమత్తమైంది.

  ఈటల రాజేందర్‌తో టచ్‌లోకి వెళ్లే నేతలపై టీఆర్ఎస్ నాయకత్వం నిఘా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈటల రాజేందర్ ప్రయత్నాలను టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోందని.. అందుకే కమలం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు సాధ్యపడటం లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల ఈటల రాజేందర్‌ను కలిసిన అమిత్ షా.. ఆయనతో ఇదే అంశంపై ప్రధానంగా చర్చలు జరిపారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  Variety Murder : ఇంజక్షన్‌తో హత్య .. లిఫ్ట్ ఇచ్చిన బైకర్‌పైనే ప్రయోగం

  Flexi controversy: ఫ్లెక్సీలో ఫోటో లేదని అధికారులపై ఫైర్ .. ఖమ్మం టీఆర్ఎస్‌లో మరోసారి బయటపడ్డ వర్గపోరు

  టీఆర్ఎస్‌లోని ముఖ్యనేతలతో పాటు ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలను కూడా తీసుకొచ్చే అంశంపై దృష్టి పెట్టాలని ఆయన ఈటల రాజేందర్‌కు సూచించారని సమాచారం. మరోవైపు తెలంగాణలో బీజేపీలోకి కొత్తగా చేరికలు ఆశించిన స్థాయిలో లేకపోవడం పట్ల బీజేపీ నాయకత్వం అసంతృప్తితో ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే చేరికలపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని అమిత్ షా ఈటల రాజేందర్‌కు సూచించారని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Amit Shah, Bjp, Telangana bjp

  ఉత్తమ కథలు