హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR వెన్నులో వణుకు.. Rahul Gandhi తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే: రేవంత్

CM KCR వెన్నులో వణుకు.. Rahul Gandhi తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే: రేవంత్

కేసీఆర్, రాహుల్ గాంధీ

కేసీఆర్, రాహుల్ గాంధీ

తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 6న వరంగల్ లో రైతు సంఘర్షణ సభ తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరనున్న రాహుల్ కోహినూర్ హోటల్ లో బస చేస్తారు. రాహుల్ పర్యటనతో కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైందని రేవంత్ అన్నారు.

తెలంగాణలో ఎన్నికల వేడిని ముందస్తుగా రాజేస్తూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగా భారీ సభ తలపెట్టింది. ఈనెల 6న జరగనున్న రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ రానున్నారు. రాహుల్ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఆదివారం ఖరారైంది. అయితే, హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు అనుమతి దక్కకపోవడంపై టీపీసీసీ నేతలు భగ్గుమంటున్నారు. రాహుల్ ఓయూ సందర్శనపై మరోసారి మాట్లాడేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిన పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్ కామెంట్లు, రాహుల్ షెడ్యూల్ వివరాలివే..

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు నిర్భంధించడం పాశివిక పాలనకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి సంఘాలను కలిసేందుకు జగ్గారెడ్డి వెళితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ పర్యటన సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందన్నారు.

World's Worst Zoo: గాయపడ్డ సింహం శ్వాస భయంకరం.. కానీ ఆకలిగొన్న సింహం రూపం కుక్క కన్నా హీనం..


‘రాహుల్ ఉస్మానియా వర్సిటీ వస్తానంటే అడ్డుకోవడం ఎందుకు? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంత రాజ్యంలో ఉన్నామా? కేసీఆర్ కుటుంబం.. అనుభవిస్తున్న భోగాలన్నీ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీల భిక్ష కాదా?’ అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ఒక పిరికి పాలకుడని, ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇక,

Prashant Kishor: బీజేపీని ఓడించేది అదొక్కటే: పీకే తాజా వ్యాఖ్యలు -కాబట్టే KCR స్వరంలో మార్పు?


తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో రాహుల్ టూర్ మొదలవుతుంది. శంషాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌ సభకు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో 2 వేదికలు ఏర్పాటు చేయనున్నారు. రాహుల్, ముఖ్య నేతలకు ఒక వేదిక...రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక ఉండనుంది. రాత్రి 7 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగించున్నారు. సభ తర్వాత రోడ్డు మార్గాన రాహుల్ హైదరాబాద్‌ రానున్నారు.

KCR అనూహ్య వ్యూహం? మోదీ సీటుకు స్పాట్ పెట్టారా? -బీజేపీలో ఏకైక మంచి మనిషి ఆయనే!!


హైదరాబాద్ లో దుర్గంచెరువు దగ్గర కోహినూర్ హోటల్‌లో రాహుల్ బస చేయనున్నారు. 7న ఉదయం ముఖ్యనేతలతో రాహుల్ అల్పాహార విందు, అనంతరం సంజీవయ్య పార్క్‌లో మాజీ సీఎం సంజీవయ్య 50వ వర్ధంతి సందర్భంగా రాహుల్ నివాళులర్పించనున్నారు. తర్వాత గాంధీభవన్‌లో 200 మంది ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. డిజిటల్ మెంబర్‌షిప్‌ ఎన్‌రోలెర్స్‌తో ఫొటో సెషన్‌లో పాల్గొననున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ లంచ్ మీటింగ్‌లో రాహుల్ పాల్గొంటారు. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీకి రాహుల్‌ వెళ్లనున్నారు.

First published:

Tags: CM KCR, Congress, Hyderabad, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Trs

ఉత్తమ కథలు