తెలంగాణలోని టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు, స్నేహం ఉండదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్ట ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు .ఇకపై ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తిన నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తామని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్తో(TRS) పొత్తు అనే నేతలు తమకు అవసరం లేదన.. వాళ్లు టీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరొచ్చని రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమవుతుందని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ(Telangana) ఏర్పాటు అంత సులువుగా జరగలేదని.. తమకు నష్టం జరుగుతందని తెలిసి కూడా కాంగ్రెస్(Congress) ఇక్కడి ప్రజల కోసం నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం లేదని రాహుల్ విమర్శించారు.
తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నారని.. కానీ ఆయన ముఖ్యమంత్రి కాదని ఒక రాజు అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు వింటాడని..కానీ రాజు అవేమీ వినడని.. తాను చేయాలనుకున్నది చేస్తాడని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న చత్తీస్గఢ్లో రైతుల రుణమాఫీ చేశామని.. వరికి రూ. 2500 మద్దతు ధర ఇస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పని చేస్తాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి లేదని.. అందుకే ఢిల్లీలో ఉంటూ రిమోట్ ద్వారా ఇక్కడి ప్రభుత్వాన్ని నడిపిస్తుందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని బీజేపీ భావిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే.. రైతులకు అండగా ఉండని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Rahul Gandhi:రైతు డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీ..2లక్షల రుణమాఫీ చేస్తాం
Rahul gandhi Telangana visit: కాంగ్రెస్కు సొంత పార్టీ ఎమ్మెల్యే జలక్.. రాహుల్ గాంధీ వరంగల్ సభకు డుమ్మా..?
ఇప్పుడు రైతుల కోసం సభ ఏర్పాటు చేసి డిక్లరేషన్ ప్రకటించిన విధంగానే.. త్వరలోనే ఆదివాసీల కోసం సభ ఏర్పాటు చేస్తామని. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అందులో పేర్కొంటామని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజలు రెండుసార్లు టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారని.. అయితే వాళ్లు ప్రజలను మోసం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని.. రాష్ట్రంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi, Telangana