Home /News /telangana /

TS POLITICS PROTEST WITH EMPTY LIQUOR BOTTLES IN JAGITYALA DISTRICT CONDEMNING THE REMARKS OF MINISTER ERRABELLI DAYAKAR SNR KNR

Jagityala: మంత్రి ఎర్రబెల్లి మాటలపై మండిపడుతున్న యువత .. కాళీ బీరు సీసాలతో అక్కడే నిరసనలు

(మీకిది తగునా మంత్రిగారు)

(మీకిది తగునా మంత్రిగారు)

jagityala: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర యువత భగ్గుమంటోంది. గ్రామపంచాయితీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా ...తాగి పాడేసిన కాళీ బీర్‌ సీసాలు అమ్ముకొని డెవలప్ చేసుకోమనడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    కరీంనగర్(Karimnagar)జిల్లాలో యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామపంచాయితీ కార్యాలయం ముందు కాళీ బీర్‌ బాటిల్స్‌( Empty BeerBottles), మద్యం సీసాలను ఉంచి ధర్నా చేపట్టారు. తెలంగాణ(Telangana) పంచాయితీరాజ్‌శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar) చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ ఈతరహా నిరసనకు దిగారు. కరీంనగర్ జిల్లానే కాదు రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో ఇదే విధంగా నిరసన చేపడుతున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యువకులు మండిపడుతున్నారు.

    మాటలపై మంటలు..
    గ్రామపంచాయితీ అభివృద్ది పనులకు సంబంధించిన నిధుల విషయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాగి పడేసిన మద్యం సీసాలను గ్రామపంచాయితీ సిబ్బంది సేకరించి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులను గ్రామ పంచాయితీ అభివృద్ధికి వినియోగించుకోవాలని చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిగ్‌గా మారింది. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా రోజుకో జిల్లాలోని కొంతమంది యువత తాగి పడేసిన మద్యం సీసాలను తీసుకొచ్చి గ్రామ పంచాయితీ కార్యాలయాల ముందు పెట్టి వెళుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.



    ఇవిగో కాళీ మద్యం సీసాలు..
    ఈ నిరసనల్లో భాగంగానే శుక్రవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన యువతతో పాటు మల్యాల మండలం బల్వంతపూర్ గ్రామానికి చెందిన మరికొందరు యువకులు పెద్ద ఎత్తున ఖాళీ బీరు సీసాలను పోగు చేసి ఆయా గ్రామపంచాయితీ కార్యాలయాల ముందు ఉంచారు. గ్రామపంచాయితీ సిబ్బంది వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో గ్రామ పంచాయితీ అభివృద్ధికి ఉపయోగించుకోమంటూ నిరసన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించకుండా కాళీ సీసాలు అమ్ముకోగా వచ్చిన డబ్బులతో అభివృద్ధి చేసుకోమని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందని కొడిమ్యాలకు చెందిన కొంతమంది యువకులు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగానే తాము కాళీ మద్యం సీసాలు సమకూర్చి గ్రామపంచాయితీ సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు.

    ఇది చదవండి : ఎమ్మెల్యేపై సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కుల్లబొడిచారు.. సీన్‌ ఎలా ఉందో చూడండి



    మీకిది తగునా మంత్రిగారు..
    పంచాయితీరాజ్‌శాఖ మంత్రిగా ఉండి గ్రామపంచాయితీల బాగోగులు చూడాల్సింది పోయి..ఇంతటి నిర్లక్ష్యంగా మాట్లాడం ఏమాత్రం సరికాదని రాష్ట్ర వ్యాప్తంగా యువకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు దిగుతామని  హెచ్చరించారు.

    ఇది చదవండి: బంధువు పేరుతో ఇంట్లో చొరబడి ఆమె ఏం చేసిందో తెలుసా.. అందుకే ఆ పనిష్మెంట్ ఇచ్చారు


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Errabelli Dayakar Rao, Jagityal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు